Beauty : టాలీవుడ్ లో ఈ మధ్యన ట్రెండ్ మారింది. ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కథలతో కూడిన సినిమాలు రావడం మొదలు పెట్టాయి. ప్రత్యేకించి యూత్ ను ఆకర్షించేలా దర్శక, నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. వారినే టార్గెట్ చేస్తూ పాటలు, సంగీతం, సన్నివేశాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అలాంటి వాటినే జనం ఆదరిస్తున్నారు. దీంతో ప్రయారిటీ కూడా బలమైన, భావోద్వేగాలను ప్రతిఫలించేలా చిత్రాలను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు మూవీ మేకర్స్.
Beauty Movie Updates
ఇక భారీ ఎత్తున సినీ, సీరియల్స్ , వెబ్ సీరీస్ లను నిర్మించే పనిలో పడ్డాయి దిగ్గజ సినీ, మీడియా సంస్థలు. ఇందులో భాగంగా తాజాగా జీ స్టూడియోస్ ఆధ్వర్యంలో నిర్మించిన బ్యూటీ(Beauty) చిత్రానికి సంబంధించి టీజర్ విడుదలైంది. పూర్తిగా ప్రేమికులను ఆకట్టుకునేలా తీశారు దర్శకుడు.
వానరా సెల్యూలాయిడ్ అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటోంది. థ్రిల్లర్ మూవీ త్రిబాణాధారి బార్బారిక్ చిత్రం త్వరలోనే ముందుకు రానుంది. మారుతీ టీంతో కలిసి బ్యూటీని తీసుకు వస్తోంది. జీ స్టూడియోస్ సమర్పిస్తోంది. ఉమేష్ కేఆర్ బన్సాల్ తో పాటు విజయ్ పాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. బ్యూటీ చిత్రానికి భలే ఉన్నాడే మూవీ ఫేమ్ వర్దన్ బ్యూటీకి వర్దన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక ఈ చిత్రానికి సంబంధించి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా చేసింది ఫస్ట్ లుక్. వాలంటైన్ డే సందర్బంగా టీజర్ ను రిలీజ్ చేసింది.
Also Read : Hero Kiran Abbavaram :మార్చి 14న రానున్న ‘దిల్ రుబా’