Beauty Pragya : స్టార్ హీరోయిన్ గా ఇప్పటికే పేరు తెచ్చుకుంది ప్రగ్యా జైశ్వాల్(Beauty Pragya). తను నందమూరి నట సింహం బాలయ్య నటించిన అఖండలో నటించింది. ప్రేక్షకుల మనసు దోచుకుంది. బాబీ దర్శకత్వంలో తాజాగా విడుదలై బాక్సాఫీస్ హిట్ సాధించిన డాకు మహారాజ్ లో కూడా కీ రోల్ పోషించింది.
Beauty Pragya Jaiswal-Akhanda 2 Movie…
అయితే వరుసగా మరో మూవీలో కూడా నటిస్తుందని అంతా భావించారు. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ మూవీ సీక్వెల్ అఖండ 2 లో తను ఉంటుందని ప్రకటించాడు కూడా. కానీ ఇంతలోనే ఏమైందో ఏమో కానీ కీలక అప్ డేట్ వచ్చింది.
అఖండ2లో ప్రగ్యా జైశ్వాల్ లేదని తన స్థానంలో కేరళ బ్యూటీ క్వీన్ సంయుక్త మీనన్ ను ఎంపిక చేసినట్లు ఇండస్ట్రీలో టాక్. ఈ మధ్యన బాలయ్య బాబు, సంయుక్త కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇదే తనను ఎంపిక చేసేలా చేసి ఉండవచ్చని సమాచారం.
ఏది ఏమైనా హ్యాట్రిక్ మూవీ మిస్ కావడంతో ఫ్యాన్స్ మాత్రం ఏదో జరిగి ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రగ్యా జైశ్వాల్ తనంతకు తానుగా తప్పుకుందా లేక మూవీ మేకర్స్ తప్పించేశారా అన్న టాక్ జోరందుకుంది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దీనినే ఎక్కువగా హైలెట్ చేయడం విశేషం. ఏది ఏమైనా అఖండ, డాకు మహారాజ్ సక్సెస్ కావడంతో తెగ సంతోషంగా ఉంది జైశ్వాల్. మరో సినిమాలో నటించేందుకు ట్రై చేస్తోంది ఈ అమ్మడు.
Also Read : Game Changer Big Shock : గేమ్ ఛేంజర్ బిగ్ షాక్