Parvati Nair : ఈ మధ్య హీరోయిన్లు ప్రేమలో పడుతున్నారు. మరికొందరు ఎంచక్కా పెళ్లికి రెడీ అయి పోతున్నారు. తాజాగా మలయాళ కుట్టి పార్వతీ నాయర్(Parvati Nair) అందరినీ విస్తు పోయేలా చేశారు. ఉన్నట్టుండి తను ప్రేమిస్తున్న వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది ఇద్దరి నిశ్చితార్థం వ్యవహారం.
Parvati Nair Engagement
ఇదిలా ఉండగా పార్వతీ నాయర్ పలు సినిమాల్లో నటించింది. సినిమాల్లోకి రాక ముందు తను మోడలింగ్ లో ప్రవేశించింది. జస్ట్ 15 ఏళ్లప్పుడే ఎంటరైంది. భిన్నమైన పాత్రలు పోషించింది. తెలుగులో నానితో జత కట్టింది. స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ మధ్యన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ గోట్ మూవీలో ఎంపికైంది. కానీ ఎందుకనో వర్కవుట్ కాక పోవడంతో విరమించుకుంది. ఇదే సమయంలో త్రిష కృష్ణన్ తనతో నటించింది.
అందాల పోటీల్లో పాల్గొనడమే కాదు ..జ్యూరీ సభ్యులను మెస్మరైజ్ చేసింది. నటనా పరంగా పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది పార్వతీ నాయర్. ఇక తను చేసుకోబోయే రాకుమారుడు చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్. త్వరలోనే ఏడడుగులు వేస్తామంటూ వెల్లడించింది పార్వతీ నాయర్. బెస్ట్ ఆఫ్ లక్ చెబుదాం ఈ ఇద్దరికీ.
Also Read : Hero Junaid Khan-Loveyapa :హాట్ స్టార్ లో లవ్‌యాపా రెడీ