Beauty Anshu – Trinadha Rao : త‌ప్పైంది మ‌హిళ‌లూ మ‌న్నించండి

డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు వేడుకోలు

Hello Telugu - Beauty Anshu - Trinadha Rao

Beauty Anshu : నేను లోక‌ల్, ధ‌మాకా సినిమాల ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు దెబ్బ‌కు దిగి వ‌చ్చారు. న‌టి అన్షు గురించి చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌ర్చ‌కు దారి తీసేలా చేశాయి. అన్షు(Beauty Anshu) సైజులు చిన్న‌గా ఉన్నాయ‌ని, వాటిని పెంచుకునేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని బ‌హిరంగ వేదిక‌గా వ్యాఖ్య‌లు చేశారు.

Beauty Anshu – Trinadha Rao..

ఆయ‌న చేసిన కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో నిర‌స‌న వ్య‌క్త‌మైంది. మ‌హిళలు, వివిధ రంగాల‌కు చెందిన వారు సీరియ‌స్ అయ్యారు. త‌క్ష‌ణ‌మే డైరెక్ట‌ర్ త్రినాథ‌రావును అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ నేరెళ్ల శార‌ద స్పందించారు. త్రినాథ‌రావు చేసిన కామెంట్స్ ను సుమోటోగా తీసుకుంటున్నామ‌ని, త్వ‌ర‌లోనే డైరెక్ట‌ర్ కు నోటీసులు జారీ చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

దీంతో డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు దిగి వ‌చ్చారు. వీడియో సందేశం వినిపించారు. అందరికీ నమస్కారం ముఖ్యంగా మహిళలకి, అన్షుకి, నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్ళందరికీ నా క్షమాపణలు తెలియజేసు కుంటున్నాన‌ని తెలిపారు. నా ఉద్దేశ్యం ఎవరిని బాధ కలిగించడం కాదు తెలిసి చేసినా తెలియకుండా చేసిన తప్పు తప్పే న‌ని అన్నారు. మీరందరూ పెద్ద మనసు చేసుకొని త‌న‌ను క్షమించాల‌ని కోరారు.

Also Read:Hardik- Beauty Janhvi : హార్దిక్ పాండ్యా జాహ్న‌వి క‌పూర్ డేటింగ్..?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com