Barroz 3D Movie : ‘బరోజ్ 3డీ’ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మలయాళ అగ్ర హీరో

మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ తెలుగులో విడుదల చేస్తోంది...

Hello Telugu - Barroz 3D Movie

Barroz 3D : ‘‘బరోజ్‌ 3డీ’ దర్శకుడిగా నాకు తొలి సినిమా. మొదటి చిత్రాన్నే త్రీడీలో చేయడం సవాల్‌గా అనిపించింది. నటుడిగా, దర్శకుడిగా ఈ చిత్రం నాకు సరికొత్త అనుభూతిని ఇచ్చింది. గత 40 ఏళ్లలో మలయాళ పరిశ్రమలో ఇలాంటి సినిమా రాలేదు’ అని మోహన్‌లాల్‌ అన్నారు.అగ్ర కథానాయకుడిగా మలయాళ పరిశ్రమను ఏలుతున్న మోహన్‌లాల్‌ ‘బరోజ్‌(Barroz 3d)’తో మెగాఫోన్‌ చేపట్టారు. ఆయన టైటిల్‌ రోల్‌ పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘బరోజ్‌ 3డీ’. ఆంటోని పెరుంబవూర్‌ నిర్మించారు.

Barroz 3D Movie Updates

మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా మోహన్‌లాల్‌ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘‘గార్డియన్‌ ఆఫ్‌ డి గామాస్‌ ట్రెజర్‌’ నవల ఆధారంగా ఒక కల్పిత ప్రపంచాన్ని సృష్టించాం. ఒక రహస్య నిధిని కాపాడుతూ అందులోని సంపదను నిజమైన వారసులకు అందించేందుకు బరోజ్‌ అనే పాత్ర చేసే ప్రయత్నాలు అద్భుతంగా ఉంటాయి. కథనం కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు తర్కాన్ని పక్కనపెట్టి, సినిమాను ఆస్వాదించాలని కోరుతున్నాను. త్రీడీ సినిమా చేయడం అంత సులువు కాదు. ప్రేక్షకుడికి గొప్ప అనుభూతిని ఇవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు పనిచేశారు. హాలీవుడ్‌ పాపులర్‌ కంపోజర్‌ మార్క్‌ కిల్లియన్‌ బీజీఎం, లిడియన్‌ నాదస్వరం సంగీతం, సంతోశ్‌ శివన్‌ కెమెరా వర్క్‌ ‘బరోజ్‌’ను ప్రత్యేకంగా నిలుపుతాయి. టాప్‌ హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ గ్రాఫిక్స్‌ను అందించారు. ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. పిల్లలు, పెద్దలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

Also Read : Sandhya Theatre : బన్నీ చేసిన తప్పుల వల్లనే ఇంత వరకు వచ్చిందా..?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com