Bangladesh Hero : బంగ్లాదేశ్ లో రోజు రోజుకు పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయి. గత రెండు మూడ రోజులుగా ఎక్కడ చూసిన నిరసనకారుల ఆందోళనలు, విధ్వంసం చెలరేగిపోతున్నాయి. మరోవైపు రిజర్వేషన్ల అంశంలో తలెత్తిన వివాదం కాస్తా చినికి చినికి గాలివానలా మారింది. ఇప్పటికే ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయింది. ప్రధాని దేశాన్ని విడిచిపెట్టి పోవడంతో అక్కడి సాధారణ ప్రజల పరిస్థితులు మరింత ఉద్రిక్తకరంగా మారాయి. ప్రభుత్వ కార్యాలయాలను ఆందోళనకారులు చుట్టుముట్టి భీభత్సం సృష్టిస్తున్నారు. ప్రధాని అధికారిక నివాసంలోని వస్తువులను నిరసనకారులు పట్టుకెళ్లిపోయి విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ లో మరో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అల్లరిమూకల దాడిలో యంగ్ హీరోతోపాటు అతడి తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయాడు.
Bangladesh Hero Death
బంగ్లాదేశ్ లో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు సలీం ఖాన్. ఇప్పటికే పలు సినిమాలను నిర్మించారు. అలాగే అతడి కొడుకు షాంటో ఖాన్ ఇప్పుడిప్పుడే హీరోగా ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. తాజాగా బంగ్లాలోని అల్లరి మూకలు ఆ తండ్రికొడుకులను దారుణంగా కొట్టి చంపేశాయి. మీడియా కథనాల ప్రకారం ఆగస్ట్ 5న సాయంత్రం చాంద్ పూర్ ప్రాంతం నుంచి తండ్రి కొడుకులు సలీం ఖాన్, షాంటో ఖాన్(Shanto Khan) లు పారిపోయారు. కానీ వీరిద్దరిని బలియా యూనియన్ లోని ఫరక్కాబాద్ మార్కెట్లో అల్లరిమూకలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో పిస్టల్ పేల్చి ఇద్దరు తండ్రికొడుకులు పారిపోయేందుకు ప్రయత్నించగా.. అప్పటికే అక్కడికి భారీగా జనాలు చేరుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన జనాలు ఆ తండ్రికొడుకులను తీవ్రంగా కొట్టగా.. అక్కడిక్కడే మరణించారు. సలీం ఖాన్ నిర్మాతగా దాదాపు పది సినిమాలను నిర్మించారు. అలాగే అతడి కుమారుడు షాంటో ఖాన్ 2023లో బాబుజాన్ సినిమాతో హీరోగా నటించాడు. ఆంటోనగర్, తుంగిపరార్ మియా భాయ్ సినిమాల్లో నటించాడు.
Also Read : Mamitha Baiju : ఆ స్టార్ హీరోకి చెల్లెలి పాత్ర కొట్టేసిన మలయాళ భామ మమిత