Bandla Ganesh : టాలీవుడ్ కు చెందిన నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా దివంగత నటుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు పేరుతో స్మారక నాణెం విడుదల చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అసలు స్మారకం అంటే ఏమిటి మారకం అంటే ఏమిటి అనే దానిపై పూర్తిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Bandla Ganesh Comments Viral
ట్విట్టర్ వేదికగా బండ్ల గణేశ్ గురువారం స్పందించారు. నాణేల గురించి పూర్తి సమాచారాన్ని పంచుకున్నారు. స్మారకం అంటే జ్ఞాపకార్థం వేసే నాణేలు. మారకం అంటే ప్రజల్లో చెలామణి లో ఉండే నాణేలు.
కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖ ఆజమాయిషీలో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, మింట్ అని రెండు శాఖలు ఉంటాయి. నాసిక్ లో ఉన్న సెక్యూరిటీ ప్రెస్ లో రూపాయల నోట్లు, ప్రామిసరీ నోట్లు, స్టాంపు పేపర్లు ముద్రిస్తారు. ముంబై , కోల్ కతా, హైదరాబాద్ లో ఉన్న మింట్ లో మారకం అయ్యే నాణేలు ( రూపాయి బిళ్లలు) తయారు చేస్తారని తెలిపారు బండ్ల గణేశ్.
అంతే కాదు ఏ వ్యక్తి పేరు మీదైనా తమకు కొన్ని నాణేలు కావాలని కోరితే , నిర్ణీతమైన మొత్తం చెల్లిస్తే వారు కోరినన్ని నాణేలు ముద్రిస్తారు. ఎక్కువ మొత్తంలో ఉంటేనే అంగీకరిస్తారు. తాజాగా విడుదలైన రామారావు బొమ్మతో ఉన్న నాణెం అలాంటిదే. దగ్గుబాటి పురందేశ్వరి ఆర్డర్ ఇచ్చి 14 వేల నాణేలు ముద్రించేలా చేశారని సమాచారం.
ఆమె కోరిక మేరకు రాష్ట్రపతి ముర్ము ఒప్పుకున్నారు. ప్రభుత్వం ఇందుకు ఒప్పుకోలేదు. ఎన్నికల సమయం కావడంతో రామారావు కుటుంబం నాణేల ముద్రణకు శ్రీకారం చుట్టిందని బండ్ల గణేశ్ పేర్కొన్నారు. కుటుంబ కార్యక్రమం కావడంతో లక్ష్మీ పార్వతిని పిలువలేదు. రామారావు నాణాలు హైదరాబాద్ లోని మింట్ లో తయారు చేశారు. సో నాణేల వెనుక ఇంత కథ ఉందన్నమాట.
Also Read : Bhagvanth Kesari Song : బాలయ్య..శ్రీలీల సాంగ్ కిర్రాక్