Balakrishna: అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుస హ్యాట్రిక్ కొట్టిన నందమూరి నటసింహం బాలకృష్ణ… తన నెక్ట్స్ ప్రాజెక్టకు NBK109 ను ప్రారంభించారు. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్త నిర్మిస్తున్న ఈ సినిమాకు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ‘బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్, వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్’ అంటూ మారణాయుధాలు, మందు బాటిల్స్ ఉన్న పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అంతేకాదు ఈ ప్రాజెక్టులోనే క్లాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటించనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి మరోక గుడ్ న్యూస్ ను అందించింది చిత్ర యూనిట్
Balakrishna – ఊర్వశీ రౌతేలా, మీనాక్షి చౌదరి, ……. ?
ఇటీవల అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల్లో ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించిన బాలకృష్ణ(Balakrishna)… తాజా సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటించడానికి ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. డిఫరెంట్ టైం జోన్స్ తో డిఫరేంట్ షేడ్స్ తో మూడు పాత్రల్లో నటిస్తున్న బాలకృష్ణ సరసన నటించడానికి ఇప్పటికే ఊర్వశీ రౌతేలాతో పాటు మీనాక్షి చౌదరిని ఎంపిక చేసనట్లు తెలుస్తోంది. మూడో హీరోయిన్ కోసం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోని ప్రముఖ తారల పేర్లను పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
Also Read : Salman Khan: ఓటీటీలోనికి సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?