సినిమా రంగానికి సంబధించి దసరా పండుగ వెరీ స్పెషల్ . నటీ నటులతో పాటు దర్శక, నిర్మాతలు ఎక్కువగా సెంటిమెంట్ ఉంటుంది. టాప్ హీరోలకు సంబంధించి సినిమాలు బరిలో ఉన్నాయి. తమిళ సినీ రంగానికి చెందిన టాప్ లో కొనసాగుతున్న తళపతి విజయ్ నటించిన లియో చిత్రం దసరా రోజు రానుంది. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు.
టాలీవుడ్ లో దిగ్గజ నట సింహంగా పేరు పొందిన నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రం కూడా రాబోతోంది. దీనికి దర్శకత్వం వహించాడు అనిల్ రావి పూడి. ఇందులో కాజల్ అగర్వాల్ తో పాటు శ్రీలీల నటించారు.
మరో వైపు మాస్ మహరాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర్ రావు నటించిన చిత్రం కూడా దసరా పండుగ నాడు ఫిక్స్ అయ్యింది. దీంతో ముగ్గురు దిగ్గజ హీరోల మధ్య పోటీ నెలకొంది. దీంతో అభిమానులకు పెద్ద పండుగేనని చెప్పక తప్పదు.
ఈ మూడు సినిమాలపై బాలకృష్ణ , జోసెఫ్ విజయ్ , రవితేజ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. వీటిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఎవరి సినిమా ఎలా ఆడుతుందనే దానిపై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.