Balakrishna-Allu Arjun : అల్లు అర్జున్ కి ఫోన్ చేసి మాట్లాడిన బాలకృష్ణ

బాలయ్య నుండి ఫోన్ రాగానే అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేస్తూ కాసేపు ముచ్చటించారు...

Hello Telugu - Balakrishna-Allu Arjun

Balakrishna : జైలు నుండి విడుదలై ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్‌ని పరామర్శించేందుకు సినిమా ఇండస్ట్రీ నుండి సెలబ్రిటీలు క్యూ కడుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, రానా దగ్గుబాటి, నాగ చైతన్య, కె. రాఘవేంద్రరావు, సురేష్ బాబు, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ సోదరులు, ఆర్. నారాయణమూర్తి, దర్శకుడు సుకుమార్, బివిఎస్‌ఎన్ ప్రసాద్, హరీష్ శంకర్, బివిఎస్ రవి, సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ, పుష్ప నిర్మాతలు నవీన్ మరియు రవిశంకర్, కొరటాల శివ, దిల్ రాజు, వంశీ పైడిపల్లి, సుధీర్ బాబు వంటి వారంతా బన్నీ ఇంటికి చేరుకుని సంఘీభావం తెలిపారు. తాజాగా అల్లు అర్జున్‌కు నటసింహం బాలయ్య(Balakrishna) ఫోన్ చేసి పరామర్శించారు.

Balakrishna Talk to…

బాలయ్య నుండి ఫోన్ రాగానే అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేస్తూ కాసేపు ముచ్చటించారు. కాల్ చేసినందుకు బాలయ్యకు బన్నీ థ్యాంక్స్ చెప్పారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు అంటే శుక్రవారం కూడా అల్లు అరవింద్‌కు బాలయ్య(Balakrishna) ఫోన్ చేసి ధైర్యం చెప్పారని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అరవింద్ నేతృత్వంలో నడుస్తున్నా ‘ఆహా’ ఓటీటీలో బాలయ్య ‘ఆన్ స్టాపబుల్ విత్ NBK’ అనే ప్రోగ్రామ్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య ఫోన్ కాల్‌తో బన్నీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాసేపటి క్రితం కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సైతం అల్లు అర్జున్ ఇంటికి వచ్చి పరామర్శించారు. ‘యూఐ’ చిత్ర ప్రమోషన్స్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఉపేంద్ర.. విషయం తెలుసుకుని అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. అల్లు అర్జున్, ఉపేంద్ర కలిసి ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

తెల్లవారితే పుష్ప-2 సినిమా విడుదలవుతుందనగా.. డిసెంబర్ నెల 4వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రీమియర్‌ షో వేయడం, ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్‌సుక్‌నగర్‌కు చెందిన రేవతి(35) మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్‌ (13) అపస్మారక స్థితికి చేరుకొని చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరితోపాటు తొక్కిసలాటలో మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యంతోపాటు.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రీమియర్‌ షో వీక్షించడానికి హీరో అల్లు అర్జున్‌ రావడం కూడా కారణమని పోలీసులు భావించారు. ఈ మేరకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి శుక్రవారం అరెస్ట్ చేశారు. మధ్యంతర బెయిల్‌తో అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలయ్యారు.

Also Read : Allu Arjun-Upendra : జైలు నుంచి రిలీజైన బన్నీని పరామర్శించేందుకు వచ్చిన కన్నడ స్టార్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com