అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా బాలయ్య బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీలీల మంచి నటి అని, అద్భుతమైన భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు.
తాను తన కొడుకు మోక్షజ్ఞతో ఓ విషయం చెప్పానని, తనకు శ్రీలీలతో కలిసి హీరోగా ఓ సినిమా చేయాలని ఉందని . దీంతో తన కొడుకు అభ్యంతరం చెప్పాడని తెలిపాడు. తాను నీకంటే బాగా నటిస్తానని , తనతో నువ్వు కాదు నేను నటించాలంటూ పోటీకి వచ్చాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నందమూరి బాలకృష్ణ.
ఇదిలా ఉండగా అందాల ముద్దు గుమ్మ శ్రీలీల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. పలు సినిమాలలో బిజీగా మారింది. ప్రిన్స్ మహేష్ బాబుతో గుంటూరు కారంలో నటిస్తోంది. ఇక ఆది కేశవ్ లో ఆకట్టుకుంటోంది. తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేనితో కలిసి నటించిన స్కంద విడుదలైంది. సూపర్ కలెక్షన్లతో దూసుకు పోతోంది ఈ చిత్రం.
మొత్తంగా లక్కి గర్ల్ గా మారి పోయింది శ్రీలీల. ఈ సినిమా కూడా తన జీవితంలో మరిచి పోలేని విధంగా ఉంటుందన్నారు . మొత్తంగా భగవంత్ కేసరి ట్రైలర్ ఇప్పుడు సూపర్ సక్సెస్ తో దూసుకు పోతోంది.