Balakrishna : నందమూరి నట సింహం బాలకృష్ణ(Balakrishna) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏ రంగంలో నైనా సరే తనతో తానే పోటీ పడతానని , ఇంకొకరితో పోల్చుకోవడాన్ని తాను ఇష్ట పడనని అన్నారు. ఏ పని చేసినా అందులో వంద శాతం బాగుండాలని కోరుకుంటానని చెప్పాడు. అందుకే తన సినిమాలు బాగా ఆడుతున్నాయని, జనం ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.
Balakrishna Key Comments
ఈ మధ్యన ఇటు సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా బిజీగా మారానని, మరో వైపు పాలిటిక్స్ పరంగా హిందూపురం నియోజకవర్గాన్ని కూడా చూసుకోవాల్సి వస్తోందన్నారు. ఎక్కడా టైం సరి పోవడం లేదని, చాలా బిజీ షెడ్యూల్ తయారైందని వాపోయారు.
తాను మొదటి నుంచి అన్నింటా ఫస్ట్ లో ఉండాలని కోరుకునే వాడినని, అదే అలవాటు తనకు వచ్చేసిందని చెప్పాడు బాలకృష్ణ. నాకు మా నాన్న విశ్వ విఖ్యాత నట సార్వభౌముడైన నందమూరి తారక రామారావు స్పూర్తి అని , ఇంకెవరినీ తాను అనుసరించనని స్పష్టం చేశారు నందమూరి బాలకృష్ణ.
ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నానని, ప్రజలకు సేవలు చేస్తూనే మరో వైపు కళామతల్లి సేవలో తరిస్తున్నానని , దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమతి ఏమిటంటే మా నాన్న ఎన్టీఆర్ అన్నారు. ఇటీవల తాను నటించిన డాకు మహారాజ్ బిగ్ సక్సెస్ గా నిలవడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం బాలయ్య చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Hero Chiranjeevi-Vishwambhara :శివ రాత్రికి ‘విశ్వంభర’ ఫస్ట్ సింగిల్