Balakrishna-Dulquer Salman: బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్ ?

బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్ ?

Hellotelugu-Balakrishna-Dulquer Salman

బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్ ?

Balakrishna-Dulquer Salman : టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. మహేష్ బాబు-వెంకటేష్ కాంబినేషన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో రెండో విడత మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్…. గోపాల గోపాల, వి, ఆర్.ఆర్.ఆర్, భీమ్లానాయక్, వాల్తేరు వీరయ్య, బ్రో వంటి సినిమాలతో నిర్విరామంగా కొనసాగుతోంది. దాదాపు మూడు దశాబ్దాలుగా టాలీవుడ్ అగ్రస్థానాల్లో కొనసాగిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున కూడా మల్టీ స్టారర్ సినిమాలకు ఓకే చెప్పిన సంగతి తెలిసింది. అయితే గోపాల గోపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, వాల్తేరు వీరయ్య, మనం వంటి సినిమాలతో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున తమ మల్టీ స్టారర్ సినిమాలను పూర్తి చేసినప్పటికీ బాలకృష్ణ మాత్రం ఇంకా ఆ సాహసం చేయలేదు.

 

అయితే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుస హ్యాట్రిక్ కొట్టిన నటసింహం బాలకృష్ణ కూడా త్వరలో మల్టీ స్టారర్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు ద్వి పాత్రాభినయం సినిమాలతో నెట్టుకొచ్చిన బాలకృష్ణ(Balakrishna)… మొట్టమొదటి సారిగా మల్టీ స్టారర్ కు ఓకే చెప్పనట్లు సమాచారం. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్త నిర్మాణంలో యువ దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ సినిమాకు బాలకృష్ణ ఒకే చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మహానటి, సీతారామం సినిమాతో క్లాస్ హీరోగా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ హీరో దల్కర్ సల్మాన్… బాలకృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Balakrishna-Dulquer Salman – గాడ్ ఆఫ్ మాసెస్… క్లాస్ ఆఫ్ ది క్లాసెస్

చిరంజీవి-రవితేజ కాంబినేషన్ లో దర్శకుడు బాబీ కొల్లి ఇటీవల తెరకెక్కించిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనితో తన తరువాత ప్రాజెక్టును బాలయ్యబాబుతో ప్రకటించడంతో పాటు ‘బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్, వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్’ అంటూ మారణాయుధాలు, మందు బాటిల్స్ ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేసారు. అయితే ఈ ప్రాజెక్టులోనే క్లాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా అధికారిక సమాచారం వెలువడనప్పటికీ… గాడ్ ఆఫ్ మాసెస్ గా గుర్తింపు పొందిన బాలకృష్ణ… క్లాస్ ఆఫ్ ది క్లాసెస్ హీరోగా ప్రేక్షకుల మనసులు దోచుకున్న దుల్కర్ సల్మాన్… జోడీ కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Jagapathi Babu: హాలీవుడ్ కి జగపతిబాబు ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com