Balakrishna : హైదరాబాద్ – నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అత్యున్నతమైన పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
Balakrishna Demands..
ఈ సందర్బంగా తనను ప్రత్యేకంగా కలిశారు కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి. అవార్డు రావడం పట్ల అభినందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో తన తండ్రి, దివంగత విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు భారత రత్న అవార్డు ఇవ్వాలని కోరారు. అన్ని విధాలుగా తన తండ్రి ఆ పురస్కారానికి అర్హుడని పేర్కొన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఆనాటి మదరాసు నగరం నుంచి హైదరాబాద్ కు సినీ పరిశ్రమను తీసుకు వచ్చేలా చేసిన ఘనత తన తండ్రికే దక్కుతుందన్నారు. అంతే కాదు దేశ రాజకీయాలలో ప్రతిపక్షాలను ఒకే వేదిక పైకి తీసుకు వచ్చింది కూడా ఎన్టీఆర్ అన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో నామ రూపాలు లేకుండా చేయడమే కాకుండా , టీడీపీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకు వచ్చేలా చేసిన చరిత్ర తన తండ్రిదన్నారు బాలకృష్ణ.
ఇన్ని అర్హతలు కలిగిన ఎన్టీఆర్ కు భారత రత్న తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై మోడీతో మాట్లాడతానని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
Also Read : Siraj – Beauty Zanai Bhosle : సింగర్ ప్రేమకు సిరాజ్ ఫిదా