Balakrishna : మినిమం గ్యారెంటీ కలిగిన ఏకైక నటుడు నట సింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna). తను తెరపై హావ భావాలను పలికించడంలో తనకు తనే సాటి. వరుస సినిమాలతో బిగ్ హిట్ కొడుతూ ముందుకు సాగుతున్నాడు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ మూవీస్ చేస్తూ వస్తున్నారు.
Balakrishna Daak Maharaaj Updates
తను ఇటీవల నటించిన సినిమాలన్నీ హిట్టే. భగవంత్ కేసరి, వీరసింహా రెడ్డి, అఖండ వంటి సినిమాలు ఉండగా వాటి సరసన మరో మూవీ చేరింది. బాబీ దర్శకత్వంలో శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశి రౌటేలాతో కలిసి నందమూరి బాలకృష్ణ కలిసి నటించిన డాకు మహారాజ్ రిలీజ్ అయిన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోయింది.
కలెక్షన్లను బద్దలు కొట్టింది. వరల్డ్ వైడ్ గా విడుదలైన డాకు మహారాజ్(Daaku Maharaaj) తన సినీ కెరీర్ లో అత్యంత జనాదరణ పొందిన చిత్రంగా నిలిచి పోయింది. నాగవంశీ దీనిని నిర్మించాడు. సినిమాకు సంబంధించి ఎస్ఎస్ థమన్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్ కాగా దబిడి దబిడి సాంగ్ వివాదాస్పదంగా మారింది.
అయినా జనం ఆదరించారు. సినిమాకు బిగ్ సక్సెస్ ను మూటగట్టారు. ఈ సందర్బంగా నందమూరి బాలకృష్ణ స్పందించారు. తన సినీ కెరీర్ లో తనకు అత్యంత సంతృప్తి కలిగించిన చిత్రం ఇదేనని అన్నారు. తన వల్ల సినిమా సక్సెస్ కాలేదని సమిష్టి కృషితో విజయం దక్కిందన్నాడు.
Also Read : Kangana Emergency Movie : ఎమర్జెన్సీ పై నిషేధం కంగనా ఆగ్రహం