Balakrishna : కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అత్యున్నతమైన పద్మ అవార్డులను ప్రకటించింది. సినీ రంగంలో ఎన్నో ఏళ్లుగా విశిష్ట సేవలు అందించిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు, దర్శక, నిర్మాతలకు తీపి కబురు చెప్పింది.
Balakrishna got Padma Bhushan Award
దక్షిణాదికి సంబంధించి అత్యంత జనాదరణ కలిగిన నటుడిగా గుర్తింపు పొందారు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నందమూరి బాలకృష్ణ(Balakrishna). ఆయన ఇటు సినీ రంగంలోనూ అటు రాజకీయ పరంగానూ బిజీగా ఉన్నారు. గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకు పోతున్నారు. తను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తున్నాయి.
ఇటీవల తను నటించిన డాకు మహారాజ్ దుమ్ము రేపింది. ఇక పాలిటిక్స్ పరంగా చూస్తే అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నారు. గతంలో కూడా ఆయన ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు.
వెండి తెర మీద తనదైన ముద్ర వేసిన బాలయ్య బుల్లి తెరపై కూడా తనకు తిరుగు లేదని నిరూపించాడు. ఆహాలో వస్తున్న అన్ స్టాపబుల్ షోను అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. తాజాగా పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది బాలయ్యకు. ఆయనతో పాటు ప్రముఖ నటుడు అజిత్ కుమార్ తో పాటు నటి శోభనకు కూడా పద్మ పురస్కారాలు లభించాయి.
Also Read : Beauty Keerthy-Antony : బ్యూటిఫుల్ కపుల్ వైరల్