Kavya : క్షణాల్లో వైరల్ కావాలంటే ఏం చేయాలో మన సినీ హీరోయిన్లకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. దానినే కేరాఫ్ గా మార్చుకుని మరింత ట్రెండింగ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్న చందంగా అప్ కమింగ్ తారలు ఎంచక్కా ఖర్చు లేకుండా ప్రచారం దొరుకుంతుండడంతో ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.
Balagam Beauty Kavya..
మరికొందరు హీరోయిన్లు తళుక్కున మెరిసినా తమకెందుకులే అని మౌనంగా ఉంటున్నా చాలా మంది హీరోయిన్లు, బిగ్ బాస్ బ్యూటీస్ , మోడల్స్ అంతా ఎక్స్ , ఇన్ స్టా, షేర్ చాట్, లాంటి వాటిలలో ఎక్కువగా తమకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నారు .
తాజాగా బలగం మూవీతో ఒక్కసారిగా తన వైపు తిప్పుకునేలా చేసింది అందాల ముద్దుగుమ్మ కావ్య కళ్యాణ్ రామ్(Kavya). ఆ మధ్యన బోల్డ్ కామెంట్స్ కూడా చేసింది. మసూదలో నటించి మెప్పించింది. కొంత గ్లామరస్ గా ఉండేందుకు ట్రై చేసింది. చిట్ చాట్ సందర్బంగా ఎక్స్ పోజింగ్ కు తాను వ్యతిరేకమని కానీ పాత్రకు అవసరమైతే అప్పుడు ఆలోచిస్తానంటోంది.
ఆ మధ్యన లేటెస్ట్ ఫోటోస్ తో అదరగొట్టిన కావ్య కళ్యాణ్ రామ్ ..లంగా ఓణీతో, చీరలో దర్శనం ఇస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది. తనకు మంచి పాత్రలు రావాలని ఆశిద్దాం.
Also Read : Shrasti Varma Shocking :బిగ్ బాస్ ఫేమ్ పై శ్రేష్టి వర్మ ఫైర్