Bade Miyan Chote Miyan: అక్షయ్, టైగర్ లతో సోనాక్షిస్టెప్పులు ! నాటు నాటు పాట కాపీ ?

అక్షయ్, టైగర్ లతో సోనాక్షిస్టెప్పులు ! నాటు నాటు పాట కాపీ ?

Hello Telugu - Bade Miyan Chote Miyan

Bade Miyan Chote Miyan: బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘బడేమియా ఛోటేమియా’. మానుషి చిల్లర్‌, సోనాక్షి సిన్హా, జాన్వీకపూర్, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ ట్రాక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను చిత్ర యూనిట్ షురూ చేసింది. దీనిలో భాగంగా ‘మస్త్‌ మలంగ్‌ ఝూమ్‌’ అంటూ సాగే సెకండ్ సాంగ్ ను విడుదల చేసింది. అర్జిత్‌ సింగ్‌, విశాల్‌ మిశ్రా, నిఖితా గాంధీ అలపించిన ఈ పాటకి ఇర్షాద్‌ కమిల్‌ సాహిత్యం అందించారు. ఈ సాంగ్ లో అక్షయ్ కుమార్(Akshay Kumar), టైగర్ ష్రాఫ్ తో కలిసి సోనాక్షి సిన్హా వేసిన స్టెప్పులకు ఈ పాట ట్రెండింగ్ లోనికి వచ్చింది. అక్షయ్, టైగర్ మధ్యలో సోనాక్షి వేస్తున స్టెప్పులకు సంబంధించిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది.

Bade Miyan Chote Miyan Viral

అయితే సినిమా ఎలాగున్నా ‘మస్త్‌ మలంగ్‌ ఝూమ్‌’ పాట అందులో స్టెప్పులు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటను పోలి ఉన్నాయంటూ నెట్టింట చర్చ జరుగుతోంది. లిరిక్స్, మ్యూజిక్ ఎలా ఉన్నా నాటు నాటు లోని సిగ్నేచర్ మూమెంట్స్ మాత్ర మక్కీకు మక్కీ కాపీ కొట్టారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. ఆ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసిన స్టెప్పులకు, కంపోజింగ్ చేసిన కొరియోగ్రఫర్ కు ఆస్కార్ వేదికపై ప్రశంసలు వర్షం కురిసిన విషయం కూడా తెలిసిందే. అటువంటి పాటలో సిగ్నేచర్ మూమెంట్స్ ను కాపీ చేయడంపై ‘బడేమియా ఛోటేమియా’ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ పై నెటిజన్లు గుస్సా అవుతున్నారు.

Also Read : Pragya Jaiswal: బాలీవుడ్ లో ‘కంచె’ బ్యూటీ రీఎంట్రీ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com