Sam CS : పుష్ప 2 మ్యూజిక్ పై స్పందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరర్

సీఎంను కలిసి వద్దామని పుష్ప బయలుదేరితే....

Hello Telugu - Sam CS

Sam CS : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ది రూల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై రూల్ చేస్తోంది. ‘పుష్ప’ చిత్రంతో తన సత్తా చాటిన అల్లు అర్జున్, ఇప్పుడు ‘పుష్ప 2(Pushpa 2)’‌తో మరోసారి తన పవర్‌ని బాక్సాఫీస్‌కి పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నిలిచింది. అయితే ఈ విషయంలో దేవి శ్రీ ప్రసాద్ కంటే మరో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌దే పెద్ద హస్తమున్నట్లు తెలుస్తోంది.

Sam CS Comment About Pushpa 2..

ఏమైందో ఏమో కానీ సడెన్ గా ‘పుష్ప 2’ ప్రాజెక్ట్ లోకి దేవి శ్రీ ప్రసాద్ ఉండగానే తమన్, సామ్ సీఎస్(Sam CS) లతో పాటు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకున్నారు. అయితే సినిమా రిలీజ్ అయ్యేసరికి ఈ సినిమాకి మేజర్ మ్యూజిక్ కంట్రిబ్యూషన్ చేసింది దేవినే అని అంతా భావించారు. ఈ నేపథ్యంలోనే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాకి 90% బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించింది నేనే అన్నారు. అలాగే సినిమాకే హైలెట్ గా నిలిచినా క్లైమాక్స్ ఫైట్ కి కూడా తానే స్కోర్ అందించినట్లు తెలిపాడు. సో, దేవి చేసిందల్ల సాంగ్స్ ని కంపోజ్ చేయడమే అనమాట. ఈ సినిమాలో ప్రతి డిపార్ట్‌మెంట్‌ తమ ప్రతిభను చూపించారు. దేవిశ్రీప్రసాద్‌ పాటలు, ఆర్‌ఆర్‌తో కట్టిపడేశారు. సామ్ సీఎస్ పెద్దగా పరిచయంలేని వారికి ఆయన ఇటీవలే ‘క’ సినిమాకి సంగీతం అందించి సూపర్ హిట్ అందుకున్నారు.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఎర్రచందనం కూలీగా కెరీర్‌ మొదలుపెట్టి సిండికేట్‌ని, రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతాడు పుష్పరాజ్‌ (అల్లు అర్జున్‌). అధికార పార్టీకి సైతం ఫండ్‌ ఇచ్చే స్థాయికి చేరుకుంటాడు. సీఎంను కలిసి వద్దామని పుష్ప బయలుదేరితే.. ‘వస్తూ వస్తూ సీఎమ్‌తో ఓ ఫొటో తీసుకుని రా’ అంటూ తన భార్య శ్రీవల్లి(రష్మిక) కోరిక కోరుతుంది. (రష్మిక).

అయితే స్మగ్లర్లు పార్టీ ఫండ్‌ ఇచ్చేంత వరకే కానీ ఫొటోలు దిగడానికి కాదని అధికార సీఎం హేళనగా మాట్లాడతాడు. దానిని సీరియస్‌గా తీసుకున్న పుష్ప ఎంపీ సిద్దప్ప (రావు రమేష్‌)తో ఓ ఫొటో తీసుకొని, తననే ముఖ్యమంత్రిని చేస్తా అని మాట ఇస్తాడు. అందుకోసం రూ.500 కోట్లు ఫండ్‌ ఇవ్వడానికి సిద్ధపడతాడు. దాని కోసం 2000 టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేయాల్సి వస్తుంది. ఆ స్మగ్లింగ్‌ని ఆపడానికి, తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ (ఫహద్‌ ఫాజల్‌) ప్రయత్నాలు చేస్తాడు. భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ని దాటుకొని ఆ 2000 వేల టన్నులు స్మగ్లింగ్‌ చేయగలిగాడా, లేదా? శ్రీవల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాడు? ఇంటి పేరు, కుటుంబం కోసం పాకులాడే పుష్పకు అది ఎలా దక్కింది? అన్నది కథ.

Also Read : Rashmika Mandanna : తన స్వీట్ మెమోరీస్ షేర్ చేసిన రష్మిక

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com