టాలీవుడ్ ను కథలు డామినేట్ చేస్తున్నాయి. చెప్పాల్సింది సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తే, హృదయానికి హత్తుకునేలా మాటలు ఉంటే చాలు ఇక హీరో , హీరోయిన్లతో , స్టార్ డమ్ తో పనేంటి అంటున్నారు క్రియేటివ్ డైరెక్టర్స్.
ప్రత్యేకించి తమిళ సినీ ఇండస్ట్రీని ప్రత్యేకంగా చెప్పాలి. దీనికి కారణం అక్కడ సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలను ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ తీస్తున్నారు. ఆ మధ్యన జ్ఞానవేల్ తీసిన జై భీమ్ దేశాన్ని కదిలించింది. నిజ జీవితంలో జరిగిన కథ ను తెరకెక్కించిన తీరు కంటతడి పెట్టించేసింది. అంతే కాదు ఏకంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా తీసేలా చేసింది.
ఇక తెలుగు సినిమా రంగానికి వస్తే పి. మహేష్ బాబు తీసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దీనిని ఎవరూ ముందు పట్టించు కోలేదు. కానీ అనుష్క అన్నీ తానై నడిపించింది. ఇక విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, ఫేమస్ యూట్యూబర్ వైష్ణవి చైతన్య కలిసి నటించిన బేబీ మూవీ ఆశించిన దానికంటే ఎక్కువ వసూళ్లు అయ్యాయి. ఏకంగా రూ. 100 కోట్ల మార్క్ దాటేసింది.
దీనికి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో తీయాలని ప్లాన్ చేస్తున్నాడట. మరి చూడాలి ఏం జరుగుతుందో.