ప్రముఖ యాంకర్ సుమ కనకాల, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల నటించిన బబుల్ గమ్ చిత్రం టీజర్ ఇవాళ రిలీజ్ అయ్యింది. ఇందులో హీరోయిన్ గా నటించిన మానస చౌదరి రెచ్చి పోయింది. మనోడికి ముద్దు, హగ్ తో ఆకట్టుకుంది. నటుడు నాని చిత్రానికి సంబంధించి టీజర్ ను విడుదల చేశాడు.
బబుల్ గేమ్ మూవీలో రోషన్ కనకాల , మానస చౌదరి , హర్ష చెముడు , కిరణ్ , అనన్య ఆకుల, హర్ష వర్దన్ , అను హసన్ , జైరామ్ ఈశ్వర్ , బిందు చంద్రమౌళి నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు రవికాంత్ పేరేపు.
ఈ సినిమాకు కథను విష్ణు కొండూరు, సెరి గన్ని తో పాటు దర్శకుడు రాశాడు. మహేశ్వరి మూవీస్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై దీనిని నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఎస్. అనంత శ్రీకర్ అసోసియేట్ మ్యూజిక్ కంపోజర్ గా ఉన్నారు.
ఎడిటింగ్ నిషాద్ యూసుఫ్ బాగుంది. విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. శివమ్ రావు ప్రొడక్షన్ డిజైన్ చేశారు బబుల్ గమ్ మూవీకి. దివ్య విజయ్ , మధులిక సంచలన లంక చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.