Babu Mohan : ప్రముఖ కమెడియన్, రాజకీయ నేత బాబు మోహన్(Babu Mohan) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలని చూశారని వాపోయాడు. అంతే కాదు తనకు పాన్ అంటే ఇష్టమని అందులోనే విషం పెట్టి లేపేయాలని అనుకున్నారంటూ బాంబు పేల్చాడు. తాజాగా చిట్ చాట్ సందర్బంగా తన జీవితంలోని అనుభవాలను ఆయన పంచుకున్నారు. తను చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇటు సినీ రంగంలో అటు రాజకీయ రంగంలో కలకలం రేపుతున్నాయి.
Babu Mohan Shocking Comments
బెస్ట్ కమెడియన్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి రేసులో కూడా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలోకి జంప్ అయ్యారు. పార్టీ చీఫ్ కిషన్ రెడ్డిపై కామెంట్స్ చేశారు. బీజేపీలో బహుజనులకు చోటు ఉండదని వాపోయాడు. ప్రస్తుతం ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తను డాక్టర్ కేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరాడు.
తన సినీ, పొలిటికల్ కెరీర్ గురించి ఆసక్తికర అంశాలు పంచుకున్నారు బాబు మోహన్. తన జీవితంలో మరిచి పోలేని సినిమా ఏమిటంటే మాయలోడు అని పేర్కొన్నాడు. అందులో దివంగత నటి సౌందర్యతో చేసిన సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యిందన్నాడు. సిల్క్ స్మిత చాలా మంచిదంటూ కితాబు ఇచ్చాడు. కానీ ఆమె ఎవరినీ కేర్ చేసేది కాదన్నాడు బాబు మోహన్ .
ఇదే సమయంలో తనకు ఎక్కువగా పాన్ లు తినే అలవాటు ఉండేదన్నాడు. పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాక తానే ఓ వ్యక్తికి పాన్ నేర్పించి డబ్బా పెట్టించానని, ఒక సమయంలో తాను పాన్ తింటుండగా అప్పటి ఎస్పీ ఫోన్ చేసి అందులో విషం ఉందని , తినొద్దని చెప్పాడని అన్నారు. ఆనాటి నుంచి నేటి దాకా పాన్ జోలికి వెళ్లడం లేదన్నాడు.
Also Read : Director Shankar Shocking :డైరెక్టర్ శంకర్ ఆస్తులు జప్తు