ఒకప్పుడు హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ అంతగా ఉండేది కాదు. ఒకవేళ ముద్దు పెట్టాలంటే అద్దాన్ని చూపించే వారు. కానీ సీన్ మారింది. టెక్నాలజీ మారింది. బూతు లీగలైజ్ అయిపోయింది. అదే ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్. ఇక హాలీవుడ్ ను మించి పోతోంది టాలీవుడ్.
ప్రతి సినిమాలో బూతులు, రొమాంటిక్ సీన్లు, ముద్దులు, కౌగిలింతలు షరా మామూలై పోయాయి. హీరోయిన్లు కేవలం అంగాంగ ప్రదర్శనకే పరిమితమై పోతున్నారు. ఇదేమిటంటే జనం ఆదరిస్తున్నారు..అందుకే తీస్తున్నామని అంటున్నారు దర్శక, నిర్మాతలు.
వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న యానిమల్ లో రష్మిక రెచ్చి పోయింది. ఇప్పుడు ఆ కిస్ సీన్ వైరల్ అవుతోంది. తగదునమ్మా అంటూ తానేమీ తక్కువ కాదంటోంది మనీషా చౌదరి. తాజాగా విడుదలైన బబ్బుల్ గమ్ సినిమా టీజర్ లో రొమాన్స్ పండించింది. కిస్ ఉంటేనే సినిమాకు మజా అంటోంది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఎప్పటిక లాగే యాంకర్ సుమ, రాజీవ్ కనకాల చిలుక పలుకులు పలుకుతున్నారు. ఈ సినిమా మంచి సందేశాన్ని ఇస్తోందని సెలవిస్తున్నారు. ఓ వైపు కిస్ తో రెచ్చి పోతే ఇది సినిమా అంటారా మరికొందరు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా బబ్బుల్ గమ్ మూవీలో దర్శకుడు ఏం చెప్పాడో తెలుసు కోవాలంటే సినిమా చూడాల్సిందే.