Ayushmann Khurrana: క్యాన్సర్ ను జయించిన స్టార్ హీరో భార్య !

క్యాన్సర్ ను జయించిన స్టార్ హీరో భార్య !

Hello Telugu - Ayushmann Khurrana

Ayushmann Khurrana: క్యాన్సర్.. ఈ పేరు వింటే చాలు సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ప్రాణాంతకమైన ఈ వ్యాధి బారిన పడేవారు… దీనిని అంత తొందరగా గుర్తించలేకపోవడం. చివరి స్టేజ్ లో గుర్తించడం… అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడం… వీటన్నింటికీ తోడు శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా ఈ క్యాన్సర్ ట్రీటెమెంట్ ను తట్టుకునే శక్తి లేకపోవడం. అయితే ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడి… దానితో పోరాడి… విజయం సాధించిన సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా ఉన్నారు. మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే, మమతా మోహన్ దాస్, హంసా నందిని, గౌతమి, సంజయ్‌ దత్‌, అనురాగ్‌ బసు తదితర ప్రముఖులు వివిధ రకాల క్యాన్సర్లకు ఎదురొడ్డి పోరాడి… దానిపై విజయం సాధించారు.

తాజాగా ప్రముఖ బాలీవుడ్ హీరో ఆయుష్మాన్‌ ఖురానా(Ayushmann Khurrana) సతీమణి తహీరా కశ్యప్‌ కూడా రొమ్ము క్యాన్సర్ ను జయించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా… ఆయుస్మాన్ ఖురానా, కొన్నేళ్ళ క్రితం రొమ్ము క్యాన్సర్ బారిన పడిన తన భార్య తహీరా కాశ్యప్ గురించి తన సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. తీవ్రమైన రొమ్ము క్యాన్సర్ తో పోరాడి జయించడంలో తన భార్య ప్రదర్శించిన ధైర్యాన్ని ఖురానా మెచ్చుకున్నారు. తన గుండె ధైర్యాన్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటానని ఆమె క్యాన్సర్ ను ఎదిరించి గెలిచిన విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Ayushmann Khurrana – ఆయుస్మాన్ ఖురానా పెట్టిన పోస్ట్ లో ఏముందంటే ?

“పంజాబ్ యూనివర్శిటీలో హట్ నంబర్ 14లో నేను సమోసా, చాయ్ చూపించి పడగొట్టిన అమ్మాయి. ఈరోజు @spokenfestలో నీ డెబ్యూకి ఆల్ ది బెస్ట్. నీ చక్కటి మనసును నేను ప్రేమిస్తున్నాను” అంటు ఫొటోలతోపాటు ఆమె వర్కౌట్స్ వీడియోను పోస్ట్ చేశారు. ఓ క్యూట్ మిర్రర్ సెల్ఫీతో పాటు తహీరా పోస్ట్ సర్జరీ పిక్ ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎలాంటి సినిమా బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చి డిఫరెంట్ సినిమాలతో వరుస హిట్లు కొడుతున్న ఆయుష్మాన్.. తహీరా కశ్యప్ అనే అమ్మాయిని కాలేజీ చదువుతున్నప్పుడే ప్రేమించారు. 2008లోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. అంతా బాగానే ఉందనుకునే టైంలో 2018లో తహీరకు రొమ్ము క్యాన్సర్ ఉన్న విషయం బయటపడింది. సరైన చికిత్స తీసుకోవడంతో ప్రస్తుతం తహీర పూర్తిగా క్యాన్సర్ నుంచి కోలుకుంది.

Also Read : Lal Salaam: ర‌జ‌నీ సినిమాను బ్యాన్ చేసిన అరబ్ దేశాలు ! కారణం ఏమిటంటే ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com