Ayushmann Khurana : బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా కీలక వ్యాఖ్యలు చేశాడు. తమిళ సినీ రంగానికి చెందిన యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. తను తలపతి విజయ్ తో తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.
Ayushmann Khurana Appreciates Atlee
తాజాగా తను బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ , నయన తార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొనేతో కలిసి జవాన్ మూవీ తీశాడు. ఇది బంపర్ హిట్ గా నిలిచింది. దుమ్ము రేపుతోంది. కలెక్షన్ల తో దూసుకు పోతోంది.
ప్రత్యేకించి షారుక్ ఖాన్ లాంటి దిగ్గజ నటుడు అట్లీ కుమార్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. అతడితో మరోసారి సినిమా చేయాలని ఉందన్నాడు. ప్రత్యేకించి సినిమా భారీ సక్సెస్ కావడానికి పూర్తి కారణం తాను కాదని డైరెక్టర్ అని కితాబు ఇచ్చాడు.
ఈ తరుణంలో ఆయుష్మాన్ ఖురానా(Ayushmann Khurana) ఆసక్తికర కామెంట్స్ చేశాడు అట్లీ కుమార్ గురించి. తనతో పాటు సినిమా చేయాలని కోరిక ఉందని స్పష్టం చేశాడు. అద్భుతమైన టేకింగ్, మేకింగ్ లో సూపర్ అని కితాబు ఇచ్చాడు బాలీవుడ్ నటుడు.
ప్రస్తుతం ప్రముఖ నటీనటులాంతా అట్లీతో పని చేయాలని కోరుకుంటున్నారు. మనోడి జవాన్ మూవీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా చేసిందనడంలో సందేహం లేదు.
Also Read : Nelson Dilipkumar : తలైవా వ్యక్తిత్వం అద్భుత పాఠం