Ayesha Omar: మహిళల రక్షణపై పాకిస్తాన్ స్టైల్ ఐకాన్, ప్రముఖ నటి ఆయేషా ఒమర్(Ayesha Omar) సంచలన వ్యాఖ్యలు చేసారు. పాకిస్తాన్ లో ముఖ్యంగా కరాచీ నగరంలో మహిళలపై దాడులు ఎక్కువ అయ్యాయని… ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా… మహిళలపై దాడులకు పాల్పడుతూ కిడ్నాప్, అత్యాచారం చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ప్రతి మనిషికి స్వేచ్ఛ, రక్షణ తప్పనిసరిగా అవసరం. కానీ ఆ రెండు పాకిస్తాన్ లో దొరకట్లేదన్నారు. తనతో పాటు ఆ దేశంలో ఉన్న మహిళలందరికీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలే కరువైపోయాయని తాజాగా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
Ayesha Omar – పాకిస్తాన్ లో మహిళలకు రక్షణ లేదు
ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో నటి ఆయేషా ఒమర్ మాట్లాడుతూ… ‘నాకు ఇక్కడ సేఫ్‌గా అనిపించడం లేదు. కాసేపు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి బయటకు వెళ్లాలనిపిస్తుంది. సరదాగా సైకిల్ తొక్కాలనిపిస్తుంది. వాకింగ్ చేయాలనీ ఉంటుంది. కానీ ఏదీ చేయలేకపోతున్నాను. కరాచీ మహిళలకు అంత సురక్షితమైన ప్రదేశం కాదనిపిస్తోంది. ఇక్కడ నాకు ఒత్తిడి, ఆందోళన ఎక్కువవుతోంది. బహుశా చాలామంది మహిళల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉండొచ్చు’ అని ఆమె స్పష్టం చేసింది. పాకిస్తాన్ మహిళలు ఎంత ఇబ్బందిపడుతున్నారో మగవాళ్లు ఎంత ప్రయత్నించినా అస్సలు అర్థం చేసుకోలేరు. ఆడవాళ్ల భయాందోళనలు వారికి ఎన్నటికీ అర్థం కావు. ఇక్కడివాళ్లు ప్రతి క్షణం భయపడుతూ నరకం చస్తున్నారు. నాపై రెండుసార్లు దాడి జరిగింది. ఎప్పుడు, ఎవరు.. ఎటు నుంచి వచ్చి కిడ్నాప్ చేస్తారో, దాడి చేస్తారో, అత్యాచారం చేస్తారోనని చాలా భయంగా ఉంది. బయటకు వెళ్తే చాలు వేధిస్తున్నారు. ఇంట్లో ఉన్నా కూడా రక్షణ లభించట్లేదు’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.
ఇది ఇలా ఉండగా ఆయేషా సోదరుడు పాకిస్తాన్‌ను వదిలేసి డెన్మార్క్‌కు వెళ్లిపోయి అక్కడే సెటిలయ్యాడు. ఇప్పుడు ఆమె తల్లి కూడా దేశాన్ని వదిలి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయేషాకు మాత్రం పాకిస్తాన్ అంటే ఇష్టమని… ఇక్కడే ఉండాలని అనుకుంటోందని… కానీ పరిస్థితులు ఆమెను ఇక్కడ బతకనిచ్చేలా లేవంటూ వదంతులు వినిపిస్తున్నాయి.
Also Read : Operation Valentine: ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ స్ట్రైక్ అదిరింది !