Avika Gor : హిందీలో ‘బాలికా వధూ’ సీరియల్‌తో పాపులర్ అయింది. ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది అవికాగోర్(Avika Gor). హిందీ, తెలుగుతోపాటు, విదేశాల్లోనూ ఫేమ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం హీరోయిన్‌గా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆమె ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ విందులో పాల్గొన్నారు. వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ కోసం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇండియన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ ప్రాతినిధ్యం వహిస్తూ ఆమె హాజరయ్యారు. ఆగస్టు మొదటి వారంలో జరిగిన ఈ కార్యక్రమం గురించి తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ వేడుకలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అవికా మాట్లాడుతూ ‘‘ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ మొదట ఫోన్ వచ్చింది. అది ఫేక్ అనుకున్నా. తర్వాత వచ్చిన మెయిల్ చూసి ఆశ్చర్యపోయా. భయం వేసింది. షూటింగ్స్ ఉన్నాయని చెప్పి తప్పించుకుందామనుకున్నా. ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి వస్తుందని నాన్న చెప్పడంతో ధైర్యంగా అనిపించింది.
Avika Gor Comment
ఆ కార్యక్రమంలో పాల్గొన్నా. చాలా గర్వంగా ఉంది. నటిగా నేను సరైన దారిలో వెళ్తున్నానని అర్థమైంది. మరెన్నో ప్రాజెక్టుల్లో యాక్ట్ చేేసందుకు కావాల్సిన ఆత్మ విశ్వాసాన్ని అందించింది. నా జీవితంలో ఇంత త్వరగా ఇలాంటి ఆహ్వానం అందుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు. నా దేశం, ఇక్కడి వినోద రంగం గొప్పతనం గురించి ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నా. ఇంత త్వరగా ఈ రోజు వస్తుందనుకోలేదు. మాది గుజరాత్ కావడంతో ప్రధాని మోదీతో గుజరాతీలో మాట్లాడా. ఆయన హ్యాపీగా ఫీలయ్యారు. తమ దేశంలో నాకెంతో మంది అభిమానులున్నారని.. నన్ను గుర్తుపట్టానని వియాత్నం ప్రధాని చెప్పారు. ఆ మాటలు నాలో సంతోషాన్ని పెంచాయి’’ అని అవికాగోర్(Avika Gor) తెలిపారు. అవికాగోర్ నటిగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. దర్శకురాలిగా మారేందుకు న్యూయార్క్‌లో మూడు సంవత్సరాలు స్క్రీన్ ప్లే రచనలో శిక్షణ కూడా పొందారు. గతేడాది ‘వధువు’, ‘మ్యాన్షన్ 24’ సిరీస్‌లతో అలరించారు. ఆమె నటించిన రీసెంట్ మూవీ ‘బ్లడీ ఇష్క్’. విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైంది.
Also Read : Derick Abraham OTT : ఓటీటీలో హల్చల్ చేస్తున్న మమ్ముట్టి క్రైమ్ థ్రిల్లర్