Average Student Nani: ఆకట్టుకుంటున్న ‘యావరేజ్‌ స్టూడెంట్‌ నాని’ టీజర్‌ !

ఆకట్టుకుంటున్న ‘యావరేజ్‌ స్టూడెంట్‌ నాని’ టీజర్‌ !

Hello Telugu - Average Student Nani

Average Student Nani: పవన్‌ కుమార్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘యావరేజ్‌ స్టూడెంట్‌ నాని(Average Student Nani)’. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌ పై పవన్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా థియేటర్లోకి రానున్న ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను ప్రారంభించింది చిత్ర యూనిట్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ ను రిలీజ్ చేశారు. మోస్ట్ రొమాంటిక్‌ గా సాగిన ఈ టీజర్‌ యూత్‌ ఆడియెన్స్‌ను ఇట్టే ఆకట్టుకునేలా ఉంది.

Average Student Nani…

ఇక టీజర్ విషయానికి వస్తే… ‘మనం ఆర్డినరీ అయినా మనం ట్రై చేసే అమ్మాయి ఎక్స్‌ట్రార్డినరీగా ఉండాలి’, ‘కాలేజ్‌లో ఉన్నంత వరకే స్టూడెంట్ నాని.. ఆ తరువాత కూకట్ పల్లి నాని’ అంటూ సాగే డైలాగ్స్‌ తో యావరేజ్ స్టూడెంట్ నాని మోస్ట్ రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా సాగింది. ఈ టీజర్‌ లో యూత్‌కి కావాల్సిన ప్రతీ అంశం చేర్చారు. రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని యాంగిల్స్‌ను టచ్ చేస్తూ టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ఈ టీజర్‌లో విజువల్స్, ఆర్ఆర్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

Also Read : Toxic: యశ్‌ ‘టాక్సిక్‌’ సినిమా నిర్మాణ సంస్థకు కోర్టు నోటీసులు !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com