Avatar: హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ జేమ్స్ కామెరూన్ ‘అవతార్-3’ కు సంబంధించి కీలకమైన అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటికే ఈ చిత్రం రెండు పార్టులుగా విడుదలై ప్రపంచంలోనే అత్యధిక ప్రేక్షకాదరణను పొంది కోట్లు వసూలు చేసిన ఈ ఫ్రాంచైజీ నుండి విడుదల కాబోయే ‘అవతార్-3’ కు సంబంధించిన టైటిల్ లుక్, విడుదల తేదీను ప్రకటించారు. ‘అవతార్- ఫైర్ అండ్ యాష్’ పేరుతో దీన్ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. మరోసారి పండోర గ్రహానికి వెళ్లడానికి సిద్థంగా ఉండండి’’ అని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Avatar sequel Updates
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఓ అద్బుత ప్రపంచం అవతార్. పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో అందరినీ కట్టిపడేశారు. ప్రపంచ చిత్ర పరిశ్రమలో ‘అవతార్’ ఓ సంచలనం. ఆ తర్వాత ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్(Avatar)’తో మంచి సర్‌ప్రైజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలైన ఆ సీక్వెల్ బాక్సాఫీసు కలెక్షన్లను కొల్లగొట్టింది. ఆ ఫ్రాంచైజీలో రానున్న మూడో భాగాన్ని పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్‌తో రూపొందించనున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ “ఈసారి సినిమాలో పాత్రలపై ఎక్కువ దృష్టి సారిస్తాము. మంచి కథనంతో భారీ విజువల్స్‌తో అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మీ అంచనాలకు మించిన లైవ్-యాక్షన్‌ని ఇందులో చూస్తారు మరో కొత్త ప్రపంచాన్ని భిన్నమైన కథనం, విభిన్నమైన పాత్రలు ఇందులో కనిపిస్తాయి. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’లో కనిపించిన కేట్ విన్స్‌లెట్ చేసిన రోనాల్ క్యారెక్టర్‌ను అవతార్ 3లో మరింత పొడిగించాము. అందుకోసం ఆమె చాలా కష్టపడి శిక్షణ తీసుకుంటుంది’ అని అన్నారు. అవతార్ ఫ్రాంచైజీలో రానున్న ‘అవతార్ 4’ 2029లో, చివరిగా రానున్న ‘అవతార్ 5’ డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో తెలిపింది.
Also Read : Mahesh Babu : నెట్టింట తెగ వైరల్ అవుతున్న సూపర్ స్టార్ మహేష్ ట్వీట్