Malvi Malhotra : నటి మాల్వి మల్హోత్రా పై కత్తితో హత్యాయత్నం

అదేంటంటే.. గతంలో నటి మాల్వి మల్హోత్రా మీద హత్యాయత్నం జరిగింది...

Hello Telugu - Malvi Malhotra

Malvi Malhotra : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. రాజ్ తనను ప్రేమంచి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాము 11 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నామని, పెళ్లి కూడా చేసుకున్నామని అందులో తెలిపింది. అలాగే రాజ్ తనకు అబార్షన్ కూడా చేయించాడంటూ అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు, ఫొటోలను పోలీసులకు సమర్పించింది. ఇక హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కారణంగానే రాజ్ తనన దూరం పెట్టాడని ఆరోపించింది. మాల్వీతో పాటు ఆమె సోదరుడు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన నటి మాల్వీ కూడా తిరిగి లావణ్యపై కేసు పెట్టింది. దీంతో లావణ్య ఫిర్యాదును పరిగణన లోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా(Malvi Malhotra), ఆమె తమ్ముడు మయాంక్ మల్హోత్రాను ఏ1, ఏ 2, ఏ 3గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు జరుగుతుండగానే మాల్వి మల్హోత్రా మీద అసిస్టెంట్‌ ప్రొడ్యూసర్‌ యోగేష్‌ తల్లి సంచలన ఆరోపణలు చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేసింది. మాల్వీ తన కుమారుడిని ప్రేమ పేరుతో మోసం చేసిందని, తమ ఆస్తులన్నింటినీ లాక్కుందని సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఒక మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

Malvi Malhotra..

అదేంటంటే.. గతంలో నటి మాల్వి మల్హోత్రా(Malvi Malhotra) మీద హత్యాయత్నం జరిగింది. మూడు సార్లు కత్తితో ఆమెను పొడిచారు. ఈ ఘటనలో గాయపడిన మాల్విని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారన్న విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇది సుమారు నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటన. 2020 అక్టోబర్‌లో ముంబైలోని అంధేరి ప్రాంతంలో మాల్వీ మల్హోత్రాపై దాడి జరిగింది. ఆమె మీద దాడి చేసింది మరెవరో కాదు యోగేష్. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా యోగేష్.. మాల్వీపై ఒత్తిడి తెచ్చారట.

అయితే అందుకు ఆమె అంగీకరించలేదట. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యోగేశ్.. మాల్వీని కత్తితో పొడిచి పారిపోయాడట. అయితే ఈ దాడిలో మాల్వీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆమె కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. అక్కడ ఆమెకు శస్త్ర చికిత్స కూడా జరిగిందట. దీనికి సంబంధించి మాల్వీ యోగేశ్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో పోలీసులు హత్యాయత్నం కేసులో యోగేశ్ ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మాల్వి మల్హోత్రా మీద కత్తితో దాడి చేసింది అనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. అలాగే మాల్వి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

Also Read : Kalki 2898 AD OTT : ఒకేసారి రెండు ఓటీటీల్లో రానున్న కల్కి 2898 ఏడి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com