Atlee Kumar : చెన్నై – ప్రముఖ తమిళ సినీ దర్శకుడు అట్లీ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను తీసిన జవాన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పెద్ద ఎత్తున పాజిటివ్ రెస్సాన్స్ వచ్చింది. థియేటర్ కు వెళ్లి సినిమా చూసిన అట్లీ మీడియాతో మాట్లాడాడు.
Atlee Kumar Comments Viral
జవాన్ ను ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రం సక్సెస్ అయ్యిందని పెద్ద ఎత్తున విషెస్ తెలియ చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియ చేస్తున్నానని అన్నాడు అట్లీ(Atlee Kumar). భారీ ఎత్తున ఖర్చుకు వెనుకాడకుండా జవాన్ ను తీశాను.
అద్భుతమైన స్పందన రావడానికి ప్రధాన కారకుడు ఎవరైనా ఉన్నారంటే కేవలం షారుక్ ఖాన్ మాత్రమే. ఆయన స్టార్ డమ్ చాలా పెద్దది. దానిని తట్టుకుని ఆ స్థాయిలో సినిమా తీయాలంటే చాలా కష్ట పడాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ సినిమా ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ కావడానికి ఆయనే కారణమని కితాబు ఇచ్చాడు దర్శకుడు అట్లీ కుమార్.
తొలిసారి షారుక్ ఖాన్ తో స్ట్రెయిట్ సినిమా తీయడం. దీంతో అట్లీ కుమార్ కు పెద్ద ఎత్తున డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ఆయన జోసెఫ్ విజయ్ తో తీసిన బిజిల్ తెలుగులో విజిల్ దుమ్ము రేపింది. మొత్తంగా జవాన్ సక్సెస్ తో ఫుల్ ఖుషీలో ఉన్నాడు దర్శకుడు, నటుడు, ఇతర సాంకేతిక వర్గం.
Also Read: Pragya Jaiswal Vs Krithi Shetty