తమిళ సినీ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను షారుక్ ఖాన్ , నయనతార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతితో కలిసి తీసిన జవాన్ దుమ్ము రేపింది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 900 కోట్ల క్లబ్ లోకి చేరుకుంది.
ఒక రకంగా చెప్పాలంటే అట్లీ కెరీర్ లో ఇది బిగ్ సక్సెస్ మూవీ. పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు డైరెక్టర్. తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ అట్లీ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాను స్పానిష్ లో కూడా చేయగలనని, ఇటీవలే హాలీవుడ్ సినీ రంగం నుంచి తనకు కాల్ వచ్చిందని చెప్పారు. త్వరలో అట్లీ కుమార్ ఎవరితో సినిమా చేస్తారనే దానిపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తళపతి విజయ్ తో అట్లీ వరుసగా మూడు సినిమాలు హిట్ ఇచ్చాడు.
ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని బాలీవుడ్ బాద్ షా తో సినిమా తీశాడు. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రికార్డుల మోత మోగిస్తోంది. ఈ ఒక్క మూవీతో దేశ వ్యాప్తంగా అట్లీ హాట్ టాపిక్ మారాడు.