Athiya Shetty: బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి గారాల పట్టి, బాలీవుడ్ నటి అతియా శెట్టి… టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఉన్నపళంగా అతియా(Athiya Shetty) త్వరలో తల్లి కాబోతోందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ ప్రెగ్నెన్సీ రూమర్స్ ఎలా పుట్టుకొచ్చాయనుకుంటున్నారా ? దీనికి అతియా తండ్రి, నటుడు సునీల్ శెట్టి ఇటీవల ఓ రియాలిటీ షోలో చేసిన వ్యాఖ్యలే కారణమట.
Athiya Shetty – నెక్స్ట్ సీజన్‌కు తాతయ్యగా వస్తానన్న సునీల్ శెట్టి !
సునీల్ శెట్టి డ్యాన్స్ దీవానె డ్యాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఓ ఎపిసోడ్‌కు గ్రాండ్ మస్తి విత్ గ్రాండ్ పేరెంట్స్ అనే థీమ్ పెట్టారు. ఈ షోలో కమెడియన్ భారతీ సింగ్… సునీల్ సర్… మీకు మనవడో, మనవరాలో పుట్టి తాతయ్యవి అయిపోయాక ఎలా ఉంటావ్ ? అని అడిగింది. అందుకు నటుడు… నెక్స్ట్ సీజన్‌లో నేను తాతయ్యనయ్యాక ఇదే స్టేజీపై నడుస్తాను అని చెప్పాడు. ఆయన సరదాగా అన్నారో… సీరియస్‌గా అన్నారో కానీ చాలామంది నిజంగానే ఈ నటుడు తాతగా ప్రమోషన్ పొందబోతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే అతియా- రాహుల్ గుడ్ న్యూస్ చెప్పనున్నారని… ఆరోజు కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అతియా ప్రెగ్నెంట్ కావచ్చని భావిస్తున్నారు. కాగా అతియా- రాహుల్ గతేడాది జనవరి 23న పెళ్లి చేసుకున్నారు.
Also Read : Salman Khan: ‘దబాంగ్ 4’ కు సిద్ధమంటున్న సల్మాన్ ఖాన్ !