DNA : అథర్వ మురళి, నిమిషా సజయన్ జంటగా నటిస్తున్న ‘డిఎన్‌ఎ’ చిత్రీకరణ పూర్తి కాగా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఫర్హానా, మాన్‌స్టర్‌తో సహా పలు చిత్రాలకు పనిచేసిన నెల్సన్ వెంకటేశన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒలింపియా మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అన్వేత్ కుమార్ దీనిని నిర్మించారు.
DNA Movie
మంచి కథాంశంతో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్న దివంగత కథానాయకుడు మురళి తనయుడు అధర్వ మురళి నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు బాలాజీ శక్తివేల్, రమేష్ తిలక్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Hero Dhanush : బాడీ గార్డ్ అత్యుత్సాహం పై ధనుష్ రియాక్షన్ కి భగ్గుమన్న నెటిజన్లు