వివేక్ అగ్ని హోత్రి తీసిన ది కశ్మీర్ ఫైల్స్ దేశ వ్యాప్తంగా వివాదాస్పద చిత్రంగా మారింది. అసలు ఇది సినిమానే కాదన్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. భారత దేశంలో సినిమా రంగానికి సంబంధించి 24 క్రాఫ్ట్స్ గురించి పూర్తిగా చెప్పే దమ్మున్నోడు ఆర్జీవీ. ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో వివాదంగా మారాయి.
అయినా వర్మ ఎవరికీ భయపడడు. తనకు తోచింది రాస్తాడు..తీస్తూనే పోతాడు. ఆయన శిష్యులు వందలాది మంది ఉన్నారు. క్రియేటివిటీని ఇష్టపడి ప్రోత్సహించే దర్శకుడు వర్మ. వాస్తవం లేకపోతే కామెంట్ చేయడు. ఆయన దారిలోకి వచ్చారు ప్రముఖ బాలీవుడ్ నటి, దాదా ఫాల్కే అవార్డు గ్రహీత ఆషా పరేఖ్.
తాజాగా వివేక్ తీసిన కాశ్మీర్ ఫైల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా ద్వారా భారీ ఎత్తున ఆదాయం సమకూరింది. మరి ఎందుకని దర్శకుడు కాశ్మీరీ పండిట్లకు సాయం చేయలేదంటూ ప్రశ్నించింది. ఇది పూర్తిగా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేసింది ఆషా పరేఖ్.
ఇదిలా ఉండగా అత్యున్నత అవార్డు పొందిన ఆషా ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేస్తుందని ఎవరూ ఊహించ లేదు. బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ది కాశ్మీర్ ఫైల్స్ ను నెత్తిన పెట్టుకున్నాయి. సాక్షాత్తు మోదీ దీనిని ప్రమోట్ చేశారు.