Arya: ‘The Village’ web series

వెబ్ సిరీస్ తో భయపెట్టడానికి వస్తున్న హీరో ఆర్య

Hellotelugu-Arya The Village

వెబ్ సిరీస్ తో భయపెట్టడానికి వస్తున్న హీరో ఆర్య

Arya : కోవిడ్-19 లాక్ డౌన్ తరువాత ప్రపంచ వ్యాప్తంగా వెబ్ సిరీస్(Web Series) కు విశేషమైన ఆదరణ పెరిగింది. దీనితో సాధారణ నటీనటులతో పాటు స్టార్ హీరోహీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ ల బాట పడుతున్నారు. ఒకప్పుడు హిందీ హీరోలు పోటీపడి మరీ వెబ్ సిరీస్(Web Series) లు చేయగా ఇప్పుడు వారి బాటలో సౌత్ హీరోహీరోయిన్లులు సైతం నడుస్తున్నారు. సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లతో పాటు విజయ్ సేతుపతి(Vijay Sethupathi), మమ్ముట్టి, నవదీప్ వంటి హీరోలు కూడా వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రముఖ తమిళ హీరో ఆర్య కూడా హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Arya – ‘ది విలేజ్‌’ ద్వారా అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు ఆర్య

ది విలేజ్‌ అనే గ్రాఫిక్‌ నవల ఆధారంగా మిలింద్ రాజు దర్శకత్వం ‘ది విలేజ్‌’ అనే వెబ్ సిరీస్ ను బి.ఎస్‌. రాధాకృష్ణన్‌ నిర్మించారు. ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫాం అయిన ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ లో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతునున్న ఈ వెబ్ సిరీస్ లో హీరో ఆర్య ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 24 నుంచి ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ లో స్ట్రీమింగ్‌ కానున్న ఈ వెబ్ సిరీస్ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉండనుంది.

‘ది విలేజ్‌’ ట్రైలర్ రిలీజ్

 

వెబ్ సిరీస్ నిర్మాణ సంస్థ గురువారం (న‌వంబ‌ర్ 9)న విడుద‌ల చేసిన 30 సెక‌న్ల‌ అఫీసియ‌ల్‌ ట్రైల‌ర్ ను ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ ద్వారా విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూసిన వారికి గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. ద‌య్యాలు, పిశాచాలు దాడులు చేయ‌డం వాటిపై మ‌న‌షులు తిరిగి పోరాటం చేయ‌డం వంటి స‌న్నివేశాలు భ‌యం కల్పించేలా ఉన్నాయి. ఓ అనుమానాస్పద‌ గ్రామంలో చిక్కుకుపోయిన త‌న కుటుంబ స‌భ్యుల‌ను వెత‌క‌డానికి వెళ్లిన‌ ఆర్య‌, ఆయ‌న స్నేహితుల‌కు ఎదురైన‌ అనుభ‌వాల నేప‌థ్యంలో పూర్తి హ‌ర్రర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సిరీస్‌లో దివ్య పిళ్లై, ఆడుకాలం నరేన్‌, జార్జ్‌ మయన్‌, పూజా రామచంద్రన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read : Hansika My3 Web Series : మై 3 వెబ్ సీరీస్ హ‌ల్ చ‌ల్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com