Article 370: 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ తర్వాత యామీ, ఆదిత్య ధర్ కాంబోలో వస్తున్న తరువాత సినిమా ‘ఆర్టికల్ 370(Article 370)’. యామీ గౌతమ్(Yami Gautam) ప్రధాన పాత్రలో ఆదిత్య సుహాస్ జంభాలె తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జ్యోతి దేశ్ పాండే, ఆదిత్య ధర్, లోకేశ్ ధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తెలుగు, తమిళం, మలయాళం ప్రేక్షకులతో పాటు జవాన్ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులకు సుపరిచితం అయిన ప్రియమణి కీలక పాత్ర పోషించింది. ఇటీవలే టీజర్ తో ఆకట్టుకున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘చరిత్రను లిఖించాలంటే దానిని ఎవరైనా తిరగరాయాలి’ అనే వ్యాఖ్యలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.
ఆర్టికల్ 370 నేపథ్యంలో కశ్మీర్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. ఏజెంట్ పాత్రలో యామీ చేస్తున్న యాక్షన్ అలరిస్తోంది. అరుణ్ గోవిల్, కిరణ్ కర్మాకర్ తదితరులు నటించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Article 370 Trailer Updates
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నిర్మాత ఆదిత్య ధర్ మాట్లాడుతూ… ‘సరైన సమయంలో, సరైన ఉద్దేశంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఒక మంచి ఆలోచనతోనే తీశాం. కాబట్టి దీనిపై వచ్చే విమర్శలను నేను పట్టించుకోను. ఇప్పటివరకు నేను దర్శకనిర్మాతగా మంచి కథనాలతో, మంచి ఉద్దేశంతోనే సినిమాలను రూపొందించా. ఏ రోజైతే సినిమాల పట్ల నా ఉద్దేశం తప్పని తేలిపోతుందో ఆ రోజే నేను సినిమాలు తీయడం ఆపేస్తా. ఇది అద్భుతమైన కథ. నేను విన్న అత్యుత్తమ కథల్లో ఇదొకటి.
ఈ చిత్రం తప్పక మెప్పిస్తుందని ఆశిస్తున్నా’ అని అన్నారు. ప్రస్తుతం ‘ఆర్టికల్ 370’ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మరుతోంది. నరేంద్రమోదీ నేతృత్వంలోని నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ఇతివృత్తంగా గతంలో తెరకెక్కించిన ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. తాజాగా జమ్మూకాశ్మీర్ లో కేంద్ర ప్రభుత్వం అమలులోనికి తీసుకొచ్చిన ‘ఆర్టికల్ 370’ ఆధారంగా ఈ సినిమను తెరకెక్కించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అంతేకాదు అంచనాలతో పాటు వివాదాలకు కూడా తలెత్తే అవకాశం కనిపిస్తోంది.
Also Read : Richa Chadha: లేటు వయసులో పెళ్ళి… వెంటనే తల్లి కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ !