Kannappa : డార్లింగ్ ప్రభాస్, విష్ణు మంచు కలిసి నటిస్తున్న కన్నప్ప(Kannappa) సినిమాకు సంబంధించి తొలి పాట శివ శివ శంకర ను ఆవిష్కరించారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ శ్రీశ్రీశ్రీ రవిశంకర్ గురూజీ. ఈ సినిమా పూర్తి భక్తి కథతో కూడుకుని ఉన్నది. భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీపై. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇందులో కీలకమైన పాత్రను పోషిస్తుండడం విశేషం.
Kannappa Movie Updates
ఈ పాటను బెంగళూరులోని శ్రీ శ్రీ రవిశంకర్ జీ ఆశ్రమంలో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, రాక్‌లైన్ వెంకటేష్ కన్నడ పంపిణీదారు, నటి సుమలత, డాక్టర్ మోహన్ బాబు, సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ , గేయ రచయిత రామజోగయ శాస్త్రి కన్నప్ప బృందంతో కలిసి ఆవిష్కరించారు. భక్తిలో లోతుగా పాతుకుపోయిన ఈ పాట శివుని దైవిక శక్తి సారాన్ని తెలియ చేస్తుంది.
ఈ సందర్బంగా డాక్టర్ మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాటను శ్రీశ్రీశ్రీ రవిశంకర్ గురూజీ ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. తప్పకుండా ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించడం ఖాయమన్నారు. ఇప్పటికే చిత్రానికి చెందిన పోస్టర్స్, పాటను పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ పాటను హిందీ వెర్షన్ లో జావేద్ అలీ పాడారు. స్టీఫెన్ దేవస్సీ స్వరపరిచారు. శేఖర్ అస్తిత్వా దీనిని రాశారు. శివ భక్తుడు కన్నప్ప. నిబద్దతకు, అంకితభావానికి నిదర్శనం తను. ఆయన జీవిత కథనే కన్నప్పలో చెప్పే ప్రయత్నం చేశామన్నారు దర్శకుడు.
అద్భుతమైన తారాగణం ఉంది. ఉత్కంఠ భరితమైన విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. విష్ణు మంచు టైటిల్ పాత్ర పోషిస్తుండగా ప్రీతి ముఖుందన్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ నటించారు. ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Also Read : Delhi New CM-Parvesh Shocking :ఢిల్లీ సీఎంగా పర్వేశ్ వర్మ ఫైనల్