Sonu Sood : విలక్షణ నటుడు సోనూ సూద్ కు బిగ్ షాక్ తగిలింది. రూ. 10 లక్షల మోసం చేసిన కేసుకు సంబంధించి ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. సాక్ష్యం చెప్పేందుకు హాజరు కాక పోవడంతో మండి పడింది. లూథియానా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వారెంట్ చేయడం కలకలం రేపింది బాలీవుడ్ లో. ప్రతి నాయకుడిగా, హీరోగా, సోనూ సూద్(Sonu Sood) ఫౌండేషన్ తో అన్నార్తులు, అభాగ్యులను ఆదుకున్న మానవతా వాదిగా పేరు పొందారు.
Sonu Sood Got Arrest Warrent
ఈ కేసులో పంజాబ్ లోని లూధియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా కేసు నమోదు చేశారు. మోహిత్ శుక్లా అనే వ్యక్తికి సంబంధించి రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టించేలా చేశాడని, దానికి పూచీకత్తుగా సోనూ సూద్ ఉన్నాడని ఆరోపణలు ఉన్నాయి.
నకిలీ రిజికా నాణెంలో ఇన్వెస్ట్ చేయమని ప్రలోభానికి గురి చేశాడని మండిపడ్డారు. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు కావాల్సిందిగా పలుమార్లు నోటీసులు జారీ చేసినా పట్టించు కోలేదని, అందుకే సోనూ సూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సి వచ్చిందని కోర్టు పేర్కొంది.
ఇదిలా ఉండగా సోనూ సూద్ దీనిపై స్పందించారు.
Also Read : Sobhita Interesting :శోభిత ధూళిపాళ ఆసక్తికర కామెంట్స్