Seetha Payanam : ప్రముఖ తమిళ సినీ నటుడు అర్జున్ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం సీతా పయనం. అర్జున్ సర్జా, ఐశ్వర్య అర్జున్ , నిరంజన్ సుధీంద్ర కలిసి నటించారు. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు. పూర్తిగా భావోద్వేగ భరితంగా తీశాడు దర్శకుడు. గతంలో తను అనేక విజయవంతమైన చిత్రాలలో భాగం పంచుకున్నాడు. ఇందులో సీత పాత్ర చిరస్మరణీయంగా ఉండి పోతుంది. దీనిని తమిళం, తెలుగు, కన్నడ భాషలలో తీశారు. మంచి ఫీల్ గుడ్ అనిపించేలా ఉంది.
Seetha Payanam Movie Poster Viral
సీత పయనంలో(Seetha Payanam) గిరిగా అర్జున్ సర్జా నటించగా ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ సీతగా నటించింది. తండ్రిని మించి నటనలో పరిణతి సాధించింది తను. నిరంజన్ సుధీంద్ర అభిగా కీ రోల్ పోషించాడు. నిరంజన్ , సత్యరాజ్, ప్రకాశ్ రాజ్, కోవై సరళ కీలక పాత్ర పోషించారు. సీతా పయనం ఆకర్షణీయమైన సినిమా అనుభవాన్ని అందించే ప్రతిభావంతులైన తారాగణాన్ని ఒకచోట చేర్చింది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా ఈ మూవీలో భాగమయ్యారు.
పవన్ అనే పాత్ర అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దాడు దర్శకుడు అర్జున్. శ్రీరామ నవమి పండుగ సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో స్పీడ్ గా కొనసాగుతోంది. సీతా పయనం మూవీకి సాయి మాధవ్ బుర్రా మాటలు రాశారు. జి. బాల మురుగన్ కెమెరా చేయగా, సంగీతం అనూప్ రూబెన్స్ అందించాడు.
Also Read : Beauty Ananya Nagalla :వెబ్ సీరీస్ ల్లో తళుక్కుమంటున్న అనన్య