Kalyan Ram : ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ , విజయశాంతి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి(Arjun s/o Vyjayanthi) చిత్రం. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ , టీజర్ కు ఊహించని రీతిలో ఆదరణ లభించింది. ఇవాళ మూవీ మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. మేకింగ్ పరంగా ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే అంచనాలకు మించి ఉండడంతో ఓటీటీలో భారీ ధర పలకడం విస్తు పోయేలా చేసింది సినీ వర్గాలను.
Kalyan Ram Movie ‘Arjun s/o Vyjayanthi’ Trailer Updates
ఈ చిత్రం నందమూరి ఫ్యాన్స్ కు కిక్ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు దర్శక, నిర్మాతలు. దర్శకుడు మేకింగ్, టేకింగ్ లో తనదైన ముద్ర వేశాడు. యాక్షన్, థ్రిల్లర్ కలిగి ఉండేలా సినిమాను రూపొందించారు. టైటిల్ కు అనుగుణంగా తల్లీ , కొడుకుల మధ్య అనుబంధానికి ప్రతీకగా ట్రైలర్ వచ్చేసింది. ఇందులో సయీ మంజ్రేకర్ కీ రోల్ పోషిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై చిత్రం రూపొందింది.
ఇక రాములమ్మగా పేరు పొందిన విజయశాంతి పోలీస్ పాత్రల్లో నటించడంలో తనకు తనే సాటి. ఆ మధ్యన పాలిటిక్స్ లో పడి సినిమాలకు దూరంగా ఉన్న తనను తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేలా చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రిన్స్ మహేష్ బాబు, రష్మిక మందన్నాతో కలిసి తీసిన సరిలేరు నీకెవ్వరూ మూవీలో విజయశాంతిని ఒప్పించాడు. ఆ తర్వాత ఫుల్ లెంగ్త్ మూవీ అర్జున్ సన్నాఫ్ విజయశాంతిలో నటిస్తోంది. ఈ మూవీ తప్పకుండా తనకు గేమ్ ఛేంజర్ అవుతుందని అంటోంది .
Also Read : Hero Pawan Kalyan-HHVM :మే 9న పవర్ స్టార్ మూవీ పక్కా