Breastfeeding : స్మార్ట్ ఫోన్ మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. టైమ్‌కు సరైన ఫుడ్ దొరకకపోయినా ఉంటున్నారు కానీ, ఫోన్ లేకుండా ఉండటం లేదు. సమయం సందర్భం లేకుండా అందరూ విపరీతంగా ఫోన్ వాడుతున్నారు.
ముఖ్యంగా మహిళలు వంట చేసే సమయంలో, నవజాత శిశువులకు పాలిచ్చే సమయంలో కూడా స్మార్ట్ ఫోన్(breastfeeding) వాడుతున్నారు. అయితే ఇలా చేయడంపై నిపుణులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహిళ జీవితంలో అమ్మతనం అనేది దేవుడు ఇచ్చిన గొప్పవరం. పిల్లలను తల్లి ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ తెలిసి తెలియక నవజాత శిశువుల దగ్గర ఉన్న సమయంలో తల్లులు స్మార్ట్ ఫోన్ వాడుతుంటారు. దీనివలన ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
Breastfeeding :
తల్లి పాలివ్వడంలో స్మార్ట్‌ఫోన్ వాడకం తల్లి భంగిమ, బిడ్డతో కమ్యూనికేషన్‌పై ప్రభావం చూపుతుందంట. దీని వల్ల తల్లికి వెన్ను నొప్పి రావచ్చని, అదేవిధంగా మొబైల్ వాడకం వల్ల తల్లుల మధ్య పిల్లలతో కమ్యూనికేషన్ తగ్గిపోతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది శిశువు యొక్క సున్నితంగా స్పందించే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుందని, తద్వారా పిల్లలలో ఒత్తిడిని కలిగిస్తుందని మరియు జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందంటున్నారు నిపుణులు.
Also Read : Crying : అమ్మాయిలు రాత్రిల్లే ఎందుకు ఏడుస్తారో తెలుసా?