Kareena : ముంబై – సినీ రంగానికి సంబంధించి బంధాలు మరింత పలుచగా ఉంటాయి. ఎవరు ఎప్పుడు కలుస్తారో ఇంకెప్పుడు విడి పోతారో ఎవరికీ తెలియదు. గతంలో బాలీవుడ్ లో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు దక్షిణాదికి కూడా పాకింది. నాగ చైతన్య సమంత ఉన్నట్టుండి ఎక్స్ వేదికగా విడి పోతున్నామంటూ పోస్ట్ చేశారు. తను మరో నటిని చేసుకున్నాడు. ప్రస్తుతం రూత్ ప్రభు ఒంటరిగా ఉంటోంది.
Kareena-Saif Love Story Updates
తాజాగా బాలీవుడ్ జంట విడి పోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి నటి కరీనా కపూర్(Kareena) ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్. కలకలం రేపుతోంది. ఇటీవలే బాంద్రా లోని తమ నివాసంలో ఉండగా సైఫ్ కత్తిపోట్లకు గురయ్యాడు. తను క్షేమంగా బయట పడ్డాడు.
ఈ తరుణంలో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని ప్రచారం జోరందుకుంది బీటౌన్ లో. ఇదిలా ఉండగా తాజాగా కరీనా కపూర్ పెళ్లి, విడాకులు, జీవితంలో ఎదురయ్యే అనూహ్యమైన సవాళ్ల గురించి ప్రత్యేకించి ఓ క్రిప్టిక్ సందేశాన్ని పోస్ట్ చేసింది.
ఈ సందర్బంగా కరీనా పోస్ట్ లో ఇలా ఉంది. వివాహాలు, విడాకులు, ఆందోళనలు, డెలివరీ, ప్రియమైన వ్యక్తి మరణం, తల్లిదండ్రుల పెంపకం..మీకు నిజంగా జరిగేంత వరకు మీరు మిమ్మల్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరంటూ పేర్కొంది. మన అంచనాలు ఒక్కోసారి తప్పుతాయి. వాస్తవంలోకి వచ్చేసరికి మీరు ఆశ్చర్య పోతారంటూ వ్యాఖ్యానించింది.
తను భావోద్వేగంతో రాసిన సందేశం ఫ్యాన్స్ ను కలవర పెట్టేలా చేసింది. వీరి పెళ్లి , బంధం గురించి ఆన్ లైన్ లో మరింత చర్చించుకునేలా చేసింది. ఈ జంట కష్ట కాలంలో ఉన్నారా అంటూ కొందరు నెటిజన్లు కూడా ఆసక్తిని ప్రదర్శించారు. వీరి పెళ్లి అక్టోబర్ 16, 2012లో జరిగింది. ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read : Beauty Sobhita Entry :శోభిత వచ్చాక చైతన్యలో కళ వచ్చింది