AR Rahman : చెన్నై – మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన సంగీత కచేరి తీవ్ర వివాదానికి దారి తీసింది. నిర్వాహకుల నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగా వేలాది మంది కచేరిని దగ్గరుండి చూడలేక పోయారు. సీట్ల కెపాసిటీ తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మొత్తంలో టికెట్లు అమ్మారు.
AR Rahman Music Concert got Viral
దీంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. చాలా మందికి ఊపిరి ఆడని స్థితి ఏర్పడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. చాలా మంది సంగీత ప్రియులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు.
చాలా మంది ఏఆర్ రెహమాన్(AR Rahman) ను తప్పు పట్టారు. ఇలాంటి వారితో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. దీనికంతటికి కారణంగా సంగీత దర్శకుడేనంటూ స్పష్టం చేశారు. దీంతో ఏఆర్ రెహమాన్ స్పందించారు. ఎవరైనా టికెట్లు కొనుగోలు చేసి కచేరినీ చూడలేక పోయారో వారంతా సంస్థ వెబ్ సైట్ లో తమ టికెట్ తో పాటు వివరాలు నమోదు చేస్తే స్పందిస్తామని పేర్కొన్నారు.
ఏఆర్ రెహమాన్ అనుసరించిన పద్దతిపై ప్రతి ఒక్కరూ తప్పు పడుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని కానీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని తాము అనుకోలేదని అంటున్నారు. మొత్తంగా చెన్నై సంగీత కచేరి ఒక విషాదంగా మిగిలి పోయింది ఫ్యాన్స్ కు.
Also Read : Miss Shetty Mr Polishetty : మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి అదుర్స్