AR Rahman: రామ్ చరణ్ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం !

రామ్ చరణ్ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం !

Hello Telugu - AR Rahman

AR Rahman: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా RC16. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్… ఆ తరువాత పూర్తి స్థాయిలో RC16 పై దృష్టి సారించనున్నారు. దీనితో RC16 సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో చిత్ర యూనిట్ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే RC16 కు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లు గతంలో దర్శకుడు బుచ్చిబాబు ఓ సందర్బంలో చెప్పారు.

AR Rahman Music to Charan Movie

అయితే ఏఆర్ రెహమాన్(AR Rahman) పుట్టిన రోజు సందర్భంగా సంగీత దర్శకుడిని శనివారం అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ కు పుష్పగుచ్చం ఇస్తున్న చిత్ర యూనిట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీనితో ఈ ఫోటోను రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఉప్పెన మ్యూజికల్ హిట్ కావడంతో… రెండో సినిమా కూడా ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కంపోజింగ్ తో జాతీయ స్థాయిలో నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన గ్రామీణ క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు గతంలో దర్శకుడు బుచ్చిబాబు ప్రకటించడంతో ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌, అత్యంత భారీ స్థాయిలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్ కీలకపాత్రల్లో పోషిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామని చెప్పడంతో అంతవరకు సస్పెన్స్ తప్పేట్లు లేదు.

Also Read : Vijay Sethupathi: ‘సింప్లిసిటీ’ లేబుల్‌ వద్దంటోన్న విజయ్‌ సేతుపతి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com