AR Rahman : ఆస్కార్ అవార్డు విన్నర్ , దేశం గర్వించ దగిన మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అల్లా రఖా రెహమాన్(AR Rahman). ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తనకు సంగీతమే ప్రపంచం..అదే లోకం కూడా. ఎప్పుడైతే మణిరత్నం రోజా సినిమా తీశాడో ఆనాటి నుంచి నేటి మరాఠా యోధుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఛావా చిత్రం దాకా సంచలనం సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడు.
AR Rahman Assets Updates
తాజాగా తను మ్యూజిక్ డైరెక్టర్ గా కంటే సింగర్ గా ఎక్కువ పారితోషకం అందుకుంటుండడం విశేషం. గతంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, కిషోర్ కుమార్, ఉదిత్ నారాయణ్, లతా మంగేష్కర్ , ఆషా భోంస్లే లాంటి గాయనీ గాయకులు ఉండే వాళ్లు. పాత తరం గాయకుల్లో కిషోర్ కుమార్ టాప్.
అత్యధిక పారితోషకం అందుకుంటున్న గాయకుడిగా మారి పోయాడు. మా తుజే సలాం పాటకు రూ. 3 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇక సినిమాకు మ్యూజిక్ అయితే రూ. 8 నుంచి 10 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఇక తన ఆస్తుల నికర విలువ ఏకంగా రూ. 1700 కోట్లు అంటే నమ్మగలమా. ఇక రెండవ స్థానంలో శ్రేయా ఘోషల్ ఉంది. తను పాటకు రూ. 25 లక్షలు వసూలు చేస్తోంది. సునిధి చౌహాన్ రూ. 18 నుంచి 20 లక్షలు, సోను నిగమ్ రూ. 15 నుంచి 80 లక్షలు వసూలు చేస్తున్నట్లు టాక్.
Also Read : Popular Actor Shiva Rajkumar :ఓటీటీలో శివన్న భైరతి రణగల్