Murugadoss : తమిళ సినీ రంగంలో టాప్ డైరెక్టర్లలో ఏఆర్ మురుగదాస్(Murugadoss) ఒకడు. తను తమిళ, తెలుగు, హిందీ సినిమాలు గతంలో తీశాడు. దళపతి విజయ్ తో తాను తీసిన సర్కార్ దేశ వ్యాప్తంగా అద్భుతంగా ఆడింది. ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నదగిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఆ మూవీలో ఓటు వాల్యూ ఏమిటో చెప్పేందుకు ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇదే సమయంలో బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ తో గజిని తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ తో తీసిన మూవీ ఆశించిన మేర ఆడలేదు.
Murugadoss Movie Updates
ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఉన్నట్టుండి మరోసారి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. టాప్ హీరో , కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కథ చెప్పాడు. తనకు విపరీతంగా నచ్చింది. ఓకే చెప్పాడు. అదే సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది సికిందర్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశాడు మురుగదాస్. వరల్డ్ వైడ్ గా భారీ మార్కెట్ కలిగిన నటుడు సల్మాన్ ఖాన్. ఇక కీలక పాత్ర పోషిస్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. తను గతంలో విజయ్ తో కలిసి నటించింది.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన అల్లు అర్జున్, సుకుమార్ మూవీ పుష్ప2లో నటించింది..మెప్పించింది. పుష్ప-1లో కూడా తనే. ఈ ఒక్క మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 1860 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది దేశంలో అత్యంత జనాదరణ పొందిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక మురుగదాస్ నేతృత్వంలోని సికిందర్ మూవీలో సల్మాన్, రష్మిక కాంబినేషన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : Popular Director Gopichand Malineni :దమ్మున్న డైరెక్టర్ గోపిచంద్ మలినేని