Aparna Das: మంజుమ్మెల్ బాయ్స్ హీరోతో నటి అపర్ణా దాస్ పెళ్లి !

మంజుమ్మెల్ బాయ్స్ హీరోతో నటి అపర్ణా దాస్ పెళ్లి !

Hello Telugu - Aparna Das

Aparna Das: మనోహరం, బీస్ట్ వంటి సినిమాలతో మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ అపర్ణా దాస్(Aparna Das) త్వరలో వివాహ బంధంలో అడుగుబెట్టబోతుంది. టాలీవుడ్‌ లో ఆదికేశ‌వ‌ చిత్రంలో వజ్ర కాళేశ్వరీ దేవిగా మెప్పించిన ఆమె… గతేడాది త‌మిళంలో రిలీజైన దాదాతో బిగ్గెస్ట్ హిట్టును అందుకోని సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే అపర్ణా దాస్ త్వరలో పెళ్ళి పీటలెక్కడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

మలయాళ హిట్‌ సినిమా మంజుమ్మెల్ బాయ్స్ హీరోల్లో ఒక‌రిగా క‌నిపించిన దీప‌క్ ప‌రంబోల్‌ తో అప‌ర్ణ‌దాస్ వివాహం జరగనున్నట్లు కోలీవుడ్‌ లో వార్తలు వినిపిస్తున్నాయి. మంజుమ్మెల్ బాయ్స్‌లో సుధి పాత్ర‌లో మెప్పించిన దీప‌క్‌ తో ఆమె ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఏడడుగులు వేయబోతున్నట్లు సమాచారం. ఏప్రిల్‌ 24న కేర‌ళ‌లోని వ‌డ‌క్క‌చేరిలో అప‌ర్ణ‌దాస్‌, దీప‌క్ వివాహం జరగబోతుందని వివాహ శుభలేఖ కూడా నెట్టింట వైరల్‌ అవుతుంది.ఈ మేరకు ఆమె ఫ్యాన్‌ అకౌంట్‌ నుంచి కూడా ఈ వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆమె నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

Aparna Das – టిక్‌టాక్‌ నుంచి హీరోయిన్‌ గా మారిన అపర్ణా దాస్

మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్ నటించిన ఆదికేశ‌వ‌లో అప‌ర్ణ‌దాస్ కీలక పాత్రలో మెరిసింది. ఈ సినిమాలో వజ్ర కాళేశ్వరీ దేవి పాత్రను ఆమె పోషించింది. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్‌ కాలేదు. ఇకపోతే తమిళంలో ‘దాదా’ అనే సినిమాలో ఓ బిడ్డ‌కు తల్లిగా కనిపించిన అప‌ర్ణ‌దాస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. అక్కడ భారీ హిట్‌ కొట్టిన ఈ సినిమా త్వరలో తెలుగులో ‘పా..పా’ పేరుతో విడుదల కానుంది. దుబాయ్‌లో ఎంబీఏ పూర్తిచేసిన ఆమె టిక్‌టాక్ వీడియోల నుంచి విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకుంది. దీంతో ఆమెకు పలు సినిమా అవకాశాలు వచ్చాయి.

Also Read : Kriti Sanon : నాకు కాబోయే వారు ఇలాగే ఉండాలంటున్న బాలీవుడ్ భామ కృతి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com