Hero Pawan Kalyan : టీటీడీ నిర్వాకం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆగ్ర‌హం

తప్పు జరిగింది క్షమించండి

Hello Telugu- Hero Pawan Kalyan

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తిరుప‌తి ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించారు. టీటీడీ బాధ్య‌తా రాహిత్యానికి ప‌రాకాష్ట అని పేర్కొన్నారు. ప్ర‌ధానంగా అత్యంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారంటూ ఈవో జె. శ్యామ‌ల రావు, ఏఈవో వెంక‌య్య చౌద‌రిల‌ను ఉద్దేశించి సీరియ‌స్ అయ్యారు. ల‌క్ష‌లాది మంది భ‌క్తుల మ‌నోభావాలు మ‌రింత దెబ్బ‌తినేలా వ్య‌వ‌హ‌రించేలా చ‌ర్య‌లు ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు డిప్యూటీ సీఎం.

Pawan Kalyan Slams TTD…

విచిత్రం ఏమిటంటే ఉన్నతాధికారులు చేసిన త‌ప్పిదాల‌కు తాము నింద‌లు మోయాల్సి వ‌స్తోంద‌న్నారు. మృతుల కుటుంబాల వ‌ద్ద‌కు టీటీడీ పాల‌క మండ‌లి వెళ్లి ప‌రామ‌ర్శించాల‌ని సూచించారు. టీటీడీ వ్యవహారాల్లో ప్రక్షాళన మొదలవ్వాల‌ని, ప్ర‌ధానంగా వి.ఐ.పి.లపై కాదు సామాన్యుల దర్శనాలపై దృష్టి పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు.

తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) అన్నారు..మృతుల కుటుంబీకులు, క్షతగాత్రులు, రాష్ట్ర ప్రజలు, వేంకటేశ్వర స్వామి భక్తులు, హైందవ ధర్మాన్ని ప్రతి ఒక్కరినీ క్షమించమని కోరుతున్నామ‌న్నారు.

రుయా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి పూర్తి భ‌రోసా ఇచ్చారు. ఇప్ప‌టికే స‌ర్కార్ రూ. 25 ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించింద‌న్నారు. మృతుల కుటుంబాల్లో ఒక‌రికి కాంట్రాక్టు జాబ్ కూడా ఇస్తామ‌న్నారు.

Also Read : Hero Charan-Game Changer : గేమ్ ఛేంజ‌ర్ టార్చ్ బేర‌ర్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com