Pawan Kalyan-OG : ఓజీ సెట్స్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..?

తమ అభిమాన హీరోను మళ్లీ వెండి తెరపై చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు...

Hello Telugu - Pawan Kalyan-OG

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌ తెరపై చివరిగా నటించిన చిత్రం ‘బ్రో’. ఆ తర్వాత పవన్ పూర్తిగా రాజకీయాల్లో బిజీగా మారారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం. ఆ తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan)తో పాటు జనసేన పార్టీ అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం పవన్‌ డిప్యూటీ సీఎంతో పాటు పలు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. దీంతో ఇక పవన్ సినిమాల్లో నటించడం కష్టమేఅనే అభిప్రాయాలు సైతం వ్యక్తమయ్యాయి. అయితే పవర్ స్టార్‌ ఫ్యాన్స్‌ మాత్రం కొత్త సినిమా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

తమ అభిమాన హీరోను మళ్లీ వెండి తెరపై చూడాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పవన్‌ చేతిలో మొత్తం మూడు సినిమాలు ఉన్న విషం తెలిసిందే. వీటిలో ఒకటి ఓజీ కాగా, మరొకటి హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్‌ సింగ్‌ ఉన్నాయి. దీంతో ఇప్పుడు అభిమానుల దృష్టి ఈ సినిమాలపై పడింది. కాగా ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వార్త పవన్‌ అభిమానులకు బూస్ట్‌ ఇచ్చినట్లు అవుతోంది. సెప్టెంబర్‌ 2వ తేదీన పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఓటీ నుంచి మేకింగ్ వీడియో రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీంతో పాటు మరో క్రేజీ వైరల్‌ అవుతోంది.

Pawan Kalyan OG Movie Updates

సెప్టెంబర్ తర్వాత పవన్(Pawan Kalyan) ఓజీ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ కానున్నాడని ఫిలింనగర్‌ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది. పవన్‌ కల్యాణ్ తన పుట్టినరోజు తర్వాత ఓజీ చిత్రీకరణను పూర్తి చేసేందుకు తన కాల్షీట్లు కేటాయించాడనేది సదరు వార్త సారంశం. అన్ని అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 3వ తేదీ నుంచే పవన్ కళ్యాణ్‌ ఓజీ షూటింగ్‌లో తిరిగి పాల్గొననున్నాడని టాక్‌ నడుస్తోంది. త్వరలోనే మేకర్స్‌ ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని సమచారం.మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో వేచి చూడాలి. ఇదిలా పవన్‌ బర్త్‌ డే సందర్భంగా.. హరిహరవీరమల్లు, ఉస్తాద్‌ భగత్‌ సింగ్ కొత్త పోస్టర్లను విడుదల చేయనున్నారని టాక్‌. అలాగే సెప్టెంబర్‌ 2వ తేదీన గబ్బర్‌ సింగ్‌ 4K వెర్షన్‌ను కూడా రీరిలీజ్ చేయబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎలా చూసుకున్న సెప్టెంబర్‌ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read : Hero Dhanush-Wayanad : వాయనాడ్ బాధితులకు తన వంతు విరాళం ప్రకటించిన ధనుష్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com